ETV Bharat / business

ఫ్రెండ్స్​తో రెస్టారెంట్ బిల్ షేర్​ చేసుకోవాలా..? గూగుల్​ పేలోని ఈ ఫీచర్​తో ఈజీగా కట్టొచ్చు - గూగుల్ పే పేమెంట్​ ఫీచర్

గూగుల్​ పేలో మనకు కొన్ని ఫీచర్లు మాత్రమే తెలుసు. కానీ అందులో మరికొన్ని తెలియని ఫీచర్లు కూడా ఉన్నాయి. అవి మన శ్రమను ఇంకాస్త తగ్గిస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.

google-tricks-and-tips-for-effortless-transactions
గూగుల్​ పే టిప్స్​
author img

By

Published : Apr 10, 2023, 11:57 AM IST

గూగుల్​ పే.. పాపులర్​ ఆన్​లైన్ పేమెంట్​ యాప్​. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ యాప్​ను వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి ఇతరులకు డబ్బును సులభంగా, సురక్షితంగా పంపించవచ్చు, వారిని నుంచి స్వీకరించవచ్చు. ఆన్​లైన్​లో కొనుగోళ్లు సైతం చేయవచ్చు. ఇంత మంది ఈ యాప్​ను వాడుతున్నప్పటికి చాలా మందికి గూగుల్ పేలో ఉండే బేసిక్​ ఫీచర్లు మాత్రమే తెలుసు. కానీ ఇందులో ఉండే అడ్వాన్స్​డ్​ ఫీచర్లు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటాయి. ఈ ఫీచర్లతో ఎటువంటి శ్రమ లేకుండా.. ఈజీగా చెల్లింపులు చేయవచ్చు. అవేంటో..? అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

  1. రిక్వెస్ట్​ మనీ..
    ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉన్నప్పుడు.. లేక వారినే డబ్బు అడగాల్సి వచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్​ ఫీచర్​ బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎంత డబ్బు కావాలో ముందుగానే వారికి తెలియజేయవచ్చు. అందుకోసం రిక్వెస్ట్ బటన్​ నొక్కి.. అమౌంట్​ ఎంటర్​ చేసి.. అవతలి వారికి పంపిస్తే సరిపోతుంది. దీనికి నోట్​ కూడా జత చేయవచ్చు. ఎందు కోసం ఈ డబ్బును రిక్వెస్ట్​ చేశారో వారికి తెలియజేయవచ్చు.
  2. స్ల్పిట్​ బిల్స్​..
    ఈ ఫీచర్​తో అమౌంట్​ను ఈజీగా విభజించవచ్చు. అంటే ఎవరెవరు ఎంత చెల్లించాలో గూగుల్​ పేనే లెక్కేసి చెబుతుంది. ఇందుకోసం ఓ గూగుల్​ పే గ్రూప్​ను​ క్రియేట్​ చేసుకోవాలి. అందులో కుటుంబసభ్యులను లేక స్నేహితులను యాడ్​ చేసుకోవాలి. గ్రూప్​లో చెల్లించాల్సిన బిల్​ను షేర్​ చేయాలి. ఎవరెవరు డబ్బు చెల్లించాలో వారిని సెలెక్ట్​ చేసుకోవాలి. ఆ తరువాత 'గూగుల్​ పే' ఎవరెవరు ఎంత చెల్లించాలో లెక్కకడుతుంది. ఇక దాని ప్రకారమే డబ్బు చెల్లించవచ్చు.
  3. క్యూఆర్​ కోడ్​..
    చాలా షాపుల్లో క్యూఆర్​ కోడ్ బోర్డులు ఉండటం మనం చూస్తునే ఉంటాం. ఆ క్యూఆర్​ కోడ్​ను ఫోటో తీసి.. దాని ప్రకారం చెల్లింపులు చేస్తుంటాం. అయితే మనం కూడా ఈ క్యూఆర్​ కోడ్​ను జనరేట్​ చేయవచ్చు. దాన్ని ఉపయోగించి ఇతరుల నుంచి డబ్బును స్వీకరించవచ్చు. అవతలి వారికి మన నంబర్​, వివరాలు ఇవ్వకుండానే లావాదేవి జరపడానికి ఈ ఫీచర్​ ఉపయోగపడుతుంది.
  4. బ్యాంక్​ అకౌంట్​ ద్వారా డబ్బును పంపడం..
    ఈ ఫీచర్​ను ఉపయోగించి డైరెక్ట్​గా బ్యాంక్ అకౌంట్​కే డబ్బులు పంపించవచ్చు. అందుకోసం పేమెంట్​ చేసేటప్పుడు బ్యాంక్​ ట్రాన్స్​ఫర్​ ఆప్షన్​ను క్లిక్​ చేయాలి. అందులో బ్యాంక్​ వివరాలను నమోదు చేయాలి. చెల్లించాల్సిన అమౌంట్​ను ఎంటర్​ చేసి.. సెండ్​ బటన్​ నొక్కాలి. దీంతో మనం పంపించిన అమౌంట్​ అవతలి వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
  5. రిమైండర్​..
    కొన్ని సార్లు మనం పేమెంట్​ చేయడం మరిచిపోతుంటాం. అలా మరిచిపోకుండా ఉండేందుకు ఈ రిమైండర్​ ఫీచర్​ చాలా ఉపయోగపడుతుంది. అద్దె, సబ్‌స్క్రిప్షన్‌ల వంటి వాటి చెల్లింపులు సరైన సమయంలో చెల్లించేందుకు ఇది సహాయపడుతుంది. ఒక్కసారి రిమైండర్​ సెట్ చేస్తే చాలు.. పేమెంట్​ డ్యూ టైమ్​ వచ్చినప్పుడు మనకు నోటిఫికేషన్​ వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.