Gold Rate Today : దేశంలో బంగారం ధర తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.350 తగ్గి.. ప్రస్తుతం రూ.51,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.420 పెరిగి.. రూ.57,950 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది. కిలో వెండి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,550 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,950గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,550 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1691 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.50 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.15,92,043 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.15,92,043 |
ఇథీరియం | రూ.1,26,923 |
టెథర్ | రూ.79.46 |
బినాన్స్ కాయిన్ | రూ.21,845 |
యూఎస్డీ కాయిన్ | రూ.79.45 |
Stock Market Updates : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్పల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్ 138 పాయింట్లు నష్టపోయి 60,031 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 17,960 దగ్గర ట్రేడవుతోంది. టాప్ 30 సూచీల్లో మారుతి, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, ఎల్టీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐఎన్ లాభాల్లో కొనసాగుతున్నాయి. కొటాక్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, మారుతీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ: గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. ఒక పైసా నష్టపోయింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 79.53కు చేరింది.
ఇవీ చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ
భారత్‌లో తొలి చిప్ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది.. రెండేళ్లలో ఉత్పత్తి షురూ!