GDP growth rate of India 2022-23 : భారత ఆర్థిక వ్యవస్థ మరోమారు రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసింది. 2022-23 తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) స్థూల జాతీయోత్పత్తి 13.5శాతం మేర పెరిగింది. బేస్ ఎఫెక్ట్(ద్రవ్యోల్బణం సూచీలో గణనీయమైన మార్పులే) ఇందుకు కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) తెలిపింది.
2021-22 క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 20.1శాతంగా ఉంది.
2022-23 క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు అనేక సంస్థలు ముందుగా అంచనా వేసినట్టే నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ 13శాతం వృద్ధి చెందొచ్చని ఇక్రా రేటింగ్ ఏజెన్సీ లెక్కగట్టింది. వృద్ధి రేటు 15.7శాతం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 16.2శాతం ఉండొచ్చని ఇటీవల ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్భంగా రిజర్వు బ్యాంకు తెలిపింది.
2022 ఏప్రిల్-జూన్ మధ్య చైనా 0.4శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.