ETV Bharat / business

10 రోజుల్లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు.. మార్కెట్లలో సరికొత్త జోష్​ - డాలరుతో పోలిస్తే రూపాయి విలువ

Foreign investors: భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. గత పది రోజుల్లో రూ.12,190 కోట్లు విలువైన షేర్లు కొనుగోలు చేయగా, దేశీయ మదుపర్లు రూ.2,667 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. విదేశీ మదుపర్ల పెట్టుబడుల రాకతో స్టాక్‌ మార్కెట్ సూచీలకు ఉత్సాహం లభించింది. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సైతం పెరిగింది.

foreign investors
విదేశీ మదుపర్లు
author img

By

Published : Aug 11, 2022, 8:05 PM IST

Foreign investors: గత పది రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపర్లు ఏకంగా రూ.12,190 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వరుసగా తొమ్మిది నెలలపాటు విక్రయాలకు దిగిన వీరు అనూహ్యంగా గత కొన్ని రోజులుగా నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడం విశేషం. ఇదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.2,677 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

విదేశీ మదుపర్ల పెట్టుబడుల రాకతో స్టాక్‌ మార్కెట్ సూచీలకు ఉత్సాహం లభించింది. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సైతం పెరిగింది. 2021 అక్టోబరు నుంచి 2022 జూన్‌ వరకు విదేశీ మదుపర్లు భారత మార్కెట్ల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. జులై నుంచి పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఎన్‌ఎస్‌డీఎల్‌ సమాచారం ప్రకారం.. గత నెలలో రూ.4,989 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జూన్‌లో రూ.50,203 కోట్లు, మే నెలలో రూ.39,993 కోట్లు, ఏప్రిల్‌లో రూ.17,144 కోట్లను ఉపసంహరించుకున్న మదుపర్లు ఒక్కసారిగా నికర కొనుగోలుదారులుగా మారడం విశేషం.

గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గణనీయంగా పెరిగాయి. గడిచిన పది రోజుల్లో సెన్సెక్స్‌ 2500 పాయింట్లు, నిఫ్టీ 746.65 పాయింట్లు లాభపడింది. మరోవైపు గత నెల డాలరుతో పోలిస్తే రూ.80కు పతనమైన రూపాయి ఈ నెలలో కాస్త కోలుకుంది. ఈరోజు రూ.79.61 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, నిర్మాణం, విద్యుత్తు రంగంలోని షేర్లపై విదేశీ మదుపర్లు ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: ఖర్చులు తగ్గించుకోవాలా? '30 డేస్ రూల్​' ట్రై చేయండి!

ఆన్​లైన్​ రుణాలపై ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు! ఇకపై ఆ సమాచారమంతా ఇవ్వాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.