ETV Bharat / business

బడ్జెట్​పై కేంద్రం కసరత్తు షురూ.. పారిశ్రామికవేత్తలతో నిర్మల భేటీ - ప్రీబడ్జెట్​ 2023

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.

pre budget consultations
pre budget consultations
author img

By

Published : Nov 21, 2022, 3:49 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​పై కసరత్తులు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ సహాయ మంత్రులు పంకజ్​ చౌదరీ, భగవత్​ కిషన్​రావ్​, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది ఆర్థిక శాఖ.

pre budget consultations
పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​

ఉద్యోగాల కల్పనను వేగవంతం చేసే అంశాలపైనే దృష్టి సారించినట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​. జీఎస్టీ, ఆదాయపు పన్నును హేతుబద్దీకరించి పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల కల్పన, సామాజిక మాళిక సదుపాయల పెంపు, పరిశ్రమల సామర్థ్యం పెంపు, భారత ఆర్థిక ప్రగతితో కూడిన ఐదు అంశాల ప్రణాళికను అందజేశారు పారిశ్రామికవేత్తలు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే పద్దు మోదీ ప్రభుత్వానికి చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది.

ఇవీ చదవండి: భారీగా పెరిగిన EPFO చందాదారులు.. దాదాపు 9లక్షల మంది కొత్తగా..

'ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నా.. భారత్ మాత్రం సేఫ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.