ETV Bharat / business

భారత్​ వృద్ధిరేటు అంచనా తగ్గించిన IMF.. ఆ పరిస్థితులే కారణం! - అంతర్జాతీయ ద్రవ్య నిధి

భారత వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులే కారణమని చెప్పింది. ఈ ఏడాది భారత వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఐఎంఎఫ్​.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.

imf growth forecast 2023
imf growth forecast 2023
author img

By

Published : Jan 31, 2023, 10:33 AM IST

Updated : Jan 31, 2023, 11:37 AM IST

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా భారత వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది. ఈ ఏడాది భారత వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఐఎంఎఫ్​.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మాత్రం తిరిగి 6.8 శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్‌ పెరగడం వల్లే.. ఈ వృద్ధిరేటు సాధ్యమవుతుందని వివరించింది. భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతుందని తెలిపింది.

ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోనే కొనసాగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఈ ఏడాది 3.4 శాతంగా ఉండే వృద్ధిరేటు 2023లో 2.9 శాతానికి పతనమవుతుందని తెలిపింది. 2024-25 ఏడాదిలో కాస్త కోలుకొని 3.1శాతానికి చేరుతుందని వివరించింది. ఆసియా వృద్ధిరేటు 2023లో 5.3 శాతం, 2024లో 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. చైనాలో ఒడిదొడుకుల కారణంగా.. ఈ ఏడాది 4.3 శాతం ఉంటుందన్న ఐఎంఎఫ్.. వచ్చే రెండేళ్లు మెరుగైన వృద్ధిని సాధిస్తుందని తెలిపింది. మొత్తంగా వచ్చే రెండేళ్లు ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్‌ మెరుగైన ప్రగతి సాధిస్తుందని స్పష్టమైంది.

Last Updated : Jan 31, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.