ETV Bharat / business

ఉద్యోగులకు EPFO దీపావళి కానుక - అకౌంట్లోకి పీఎఫ్ వడ్డీ - చెక్​ చేసుకోండిలా! - ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ జమ

EPFO Interest 2022-23 : దీపావళి వేళ ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని పీఎఫ్ అకౌంట్లలో జమ చేయడం ప్రారంభించింది. మరి.. మీ అకౌంట్లలో వడ్డీ పడిందో లేదో ఈ పద్ధతుల ద్వారా ఈజీగా చెక్ చేసుకోండి.

EPFO Diwali Gift for Employees
EPFO Diwali Gift for Employees
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 4:19 PM IST

EPFO Interest 2022-23 : దీపావళి సందర్భంగా.. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO).. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్‌ వడ్డీ (PF Interest)ని ఖాతాదారుల అకౌంట్లలో జమచేస్తోంది. కొందరి ఖాతాల్లో ఇప్పటికే వడ్డీ సొమ్ము జమ అయ్యింది. ఇంకా.. పలువురి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ.. పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీని కింద ప్రతినెలా మీ జీతం నుంచి 12 శాతం వరకు పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. మీరు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం కూడా.. అంతే మొత్తంలో సొమ్మును మీ పీఎఫ్​ అకౌంట్​కు జమ చేస్తుంది. ఇలా జమచేసిన డబ్బులపై EPFO ప్రతి ఏటా వడ్డీ చెల్లిస్తుంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని.. ఇప్పుడు జమ చేయడం ప్రారంభించింది. వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరి, ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈపీఎఫ్​ఓలో ఖాతా ఉంటే.. ఇప్పుడే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.

How Much Money You Can Withdraw from PF : ఉద్యోగంలో ఉండగానే పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు... ఎంత శాతమో తెలుసా?

మీ పీఎఫ్​ బ్యాలెన్స్​ను ఈపీఎఫ్​ఓ అధికారిక ఫోర్టల్ ద్వారా, ఉమంగ్ యాప్ ద్వారా, టెక్ట్స్ మెసేజ్ ద్వారా, అదేవిధంగా మిస్డ్ కాల్​ అలర్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

EPFO వెబ్‌సైట్‌ ద్వారా : మీ పీఎఫ్ అకౌంట్​లో ఈపీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి.. ముందు మీరు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లోని సర్వీసెస్‌ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘For Employees’ సెక్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత అందులో మెంబర్‌ పాస్‌బుక్‌ను ఎంచుకోవాలి. ఆపై లాగిన్‌ పేజీలో యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వడం ద్వారా మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు.

ఉమాంగ్‌ యాప్‌ ద్వారా : ముందు మీ మొబైల్​లో ఉమాంగ్‌ యాప్‌(Umang App) డౌన్​లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్​ను ఓపెన్​ చేసి అందులో ఈపీఎఫ్‌ సెక్షన్‌లోకి వెళ్లి.. వ్యూ పాస్‌బుక్ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అనంతరం UAN నంబర్‌ ఎంటర్‌ చేసి గెట్‌ ఓటీపీ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆపై మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు ఈపీఎఫ్‌ అకౌంట్‌ వివరాలు కనిపిస్తాయి.

మెసేజ్ ద్వారా : మీరు 7738299899 నంబర్‌కు మెసేజ్‌ పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్​ తెలుసుకోవచ్చు. మీ రిజిస్టర్​ మొబైల్ నంబర్ నుంచి EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నంబర్ ఎంటర్ చేసి.. ENG లేదా TEL లేదా HIN ఇలా లాంగ్వేజ్ ఏదైతే అది ఎంటర్ చేసి.. పై నంబర్​కు మెసేజ్ పంపాలి. మీ పీఎఫ్ బ్యాలెన్స్​ను మెసేజ్ రూపంలో అందుకుంటారు.

మిస్డ్ కాల్ ద్వారా : UANతో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్‌ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్ కచ్చితంగా UANకు లింక్ అయి ఉండాలి.

How to Link Aadhaar with UAN in Online : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? వెంటనే ఈ పని చేయండి..!

How to Withdraw Deceased Employee PF : మరణించిన ఉద్యోగి పీఎఫ్.. నామినీ ఎలా పొందాలో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.