ETV Bharat / business

ఎలాన్​ మస్క్​ చేతికి 'ట్విట్టర్​'.. పరాగ్ అగర్వాల్, గద్దె విజయపై వేటు - మస్క్​ ట్విట్టర్​ కొనుగోలు

Elon Musk Twitter: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​.. సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్​ను ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నారు. 44 కోట్ల డాలర్లకు ట్విట్టర్‌ను దక్కించుకున్నారు. ట్విట్టర్​ను దక్కించుకున్న వెంటనే ప్రస్తుత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, లీగల్​ హెడ్​ విజయ గద్దెతో పాటు పలు విభాగాల అధిపతులను మస్క్‌ తొలగించారు.

Elon Musk bought Twitter and removed ceo parag agarwal

author img

By

Published : Oct 28, 2022, 7:33 AM IST

Updated : Oct 28, 2022, 10:06 AM IST

Elon Musk Twitter: ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్​ కొనుగోలు వ్యవహారం ఎట్టకేలకు పూర్తయింది. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ దాన్ని సొంతం చేసుకున్నారు. 44కోట్ల డాలర్లతో ట్విట్టర్​ను మస్క్‌ హస్తగతం చేసుకున్నారు. అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్‌వో నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌, లీగల్‌ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె సహా మరికొంత మందిని కూడా తొలగించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మస్క్​ ట్వీట్​..
ట్విట్టర్​ కొనుగోలు చేసిన అనంతరం మస్క్​ తొలిసారి స్పందించారు. పక్షి విముక్తి పొందిందంటూ ట్వీట్​ చేశారు.

  • the bird is freed

    — Elon Musk (@elonmusk) October 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రొఫైల్​, లోకేషన్​ మార్పు..
ట్విట్టర్​ కొనుగోలు విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావడానికి కోర్టు అక్టోబరు 28 తుది గడువుగా విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రక్రియను పూర్తి చేసే చర్యలను వేగవంతం చేసిన మస్క్‌..13 బిలియన్‌ డాలర్ల రుణాల కోసం ఇటీవలే బ్యాంకర్లతో భేటీ అయ్యారు. తాజాగా ట్విట్టర్​ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. అక్కడ అడుగుపెడుతున్న ఓ వీడియోను ఆయన గురువారం పోస్ట్‌ చేశారు. ట్విట్టర్​లో తన ప్రొఫైల్‌ను చీఫ్‌ ట్విట్‌గా మార్చారు. తన లొకేషన్‌ను సైతం ట్విట్టర్​ ప్రధాన కార్యాలయంగా మార్పు చేశారు.

ట్విట్టర్​ను కొనుగోలు చేయడానికి కోర్టు ఇచ్చిన గడువుకు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ వీడియోలో మస్క్‌ ఓ సింకును మోస్తూ కనిపించారు. 'ట్విట్టర్​ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టా..'నంటూ ఆ వీడియోకు శీర్షికగా రాసుకొచ్చారు. ఈ క్రమంలో ట్విట్టర్​ను ఎలాన్‌ మస్క్‌ హస్తగతం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Last Updated : Oct 28, 2022, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.