ETV Bharat / business

ఇంటి నుంచే 'గోల్డ్​ లోన్​' తీసుకోవాలా? ఇలా చేయండి!

Doorstep gold loan: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట డోర్​స్టెప్​ గోల్డ్​ లోన్​. మీ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాలు ఇస్తామని పలు బ్యాంకులు, ఫిన్​టెక్​ లెండర్స్​ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే.. బ్యాంకుకు వెళ్లకుండా బంగారంపై రుణం ఎలా తీసుకోవాలి? దాని ప్రక్రియ ఏమిటి? ఎలా తీసుకుంటే మేలు? అనే విషయాలు మీకోసం..

Doorstep gold loan
గోల్డ్​ లోన్​
author img

By

Published : May 1, 2022, 4:07 PM IST

Online gold loan: కొవిడ్​-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో బ్యాంకింగ్​ సహా ఇతర రంగాల్లో కీలక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం రుణం పొందేందుకు నేరుగా బ్యాంకు వెబ్​సైట్ లేదా మొబైల్​ యాప్​ ద్వారానే దరఖాస్తు చేసుకుంటున్నారు. బంగారంపై రుణాలకు డిమాండ్​ పెరగటం, కరోనా కారణంగా సేవలను విస్తరించాల్సిన అవసరం రావటం వల్ల కొన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు(ఎన్​బీఎఫ్​సీ), ఫిన్​టెక్​ రుణ సంస్థల వంటివి ఇంటి వద్దకే గోల్డ్​ లోన్​ సేవలను ప్రారంభించాయి. ఫెడరల్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఐఐఎఫ్​ఎల్​ ఫైనాన్స్, ఇండెల్​ మనీ, మణప్పురం, ఫిన్​టెక్​ లెండర్స్​ రుపీక్​, రప్టాక్​, ధండన్​ గోల్డ్​ వంటి ఆర్థిక సంస్థలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, ఈ సేవలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి నుంచే గోల్డ్​ లోన్​ పొందటం ఎలా?: బ్యాంకు లేదా ఎన్​బీఎఫ్​సీ, ఫిన్​టెక్​ సంస్థల వెబ్​సైట్​, యాప్​ ద్వారా గోల్డ్​ లోన్​ డోర్​స్టెప్​ సర్వీస్​ పొందేందుకు అపాయింట్​మెంట్​ బుక్​ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా సంస్థల నుంచి లోన్​ మేనేజర్​ మీ ఇంటికి వచ్చి అవసరమైన ప్రక్రియ, బంగారం విలువ కట్టటం వంటివి పూర్తి చేస్తారు. మీ గుర్తింపు కోసం ఆధార్​ కార్డు లేదా పాన్​ కార్డు, అడ్రస్​ కోసం విద్యుత్తు బిల్లు, టెలిఫోన్ బిల్లు సహా ఫొటోలు అవసరమవుతాయి. రుణం ఇచ్చే పరిమితి ఆయా సంస్థలను బట్టి మారుతుంటుంది.

ఫెడరల్​ బ్యాంకులో డోర్​స్టెప్​ సర్వీస్​ ద్వారా బంగారం రుణానికి దరఖాస్తు చేసినట్లయితే.. దాని పరిమితి రూ.50వేల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుంది. ఫిన్​టెక్​ లెండర్​ ధండర్​ గోల్డ్​లో తీసుకోవాలంటే.. అది రూ.25వేల నుంచి రూ.75 లక్షల వరకు లభిస్తుంది. అలాగే.. కనీస రుణ చెల్లింపు వ్యవధి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇంటి వద్దే బంగారం రుణం సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అప్పు విలువ, బంగారం బరువు, రుణం తీసుకున్న తేదీ, ఆభరణాలు, వడ్డీ వంటి వివరాలు రుణం మంజూరైన తర్వాత ఆన్​లైన్​ ఖాతాలో కనిపిస్తాయి.

బంగారం మదింపు ప్రక్రియ ఏమిటి?: ఇంటి వద్దే బంగారం మదింపు వేస్తారు లోన్​ మేనేజర్​. దాని స్వచ్ఛత సహా వివిధ పరీక్షలను నిర్వహిస్తారు. భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ లోన్​ టూ వాల్యూ(ఎన్​టీవీ)ని గరిష్ఠంగా 75 శాతంగా నిర్ణయించింది. అంటే.. మీ బంగారం విలువ రూ. 5 లక్షలు ఉందనుకుంటే.. మీకు రూ.3.75 లక్షల వరకు రుణం వచ్చే అవకాశం ఉంది. అలాగే.. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టే విషయంలో అవి 18 క్యారెట్లు లేదా అంతకన్నా ఎక్కువగా స్వచ్ఛతగా ఉన్నప్పుడే వాటిని ఆమోదిస్తారు. ఆభరణాల్లోని బంగారాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. మెటల్స్​, జెమ్స్​, స్టోన్స్​ వంటివి లెక్కించరు. మరోవైపు.. బంగారం కడ్డీలు, నాణేలు, విరిగిపోయిన నగలను అంగీకరించరు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు సుమారు 30 నిమిషాలు పడుతుంది. ఆ వెంటనే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.

బ్యాంకు, ఎన్​బీఎఫ్​సీ, ఫిన్​టెక్​ లెండర్స్​ మధ్య తేడా ఏమిటి?: బ్యాంకు లేదా బ్యాంకింగేతర సంస్థలో గోల్డ్ లోన్​కు దరఖాస్తు చేస్తే.. వారు వసూలు చేసే వడ్డీ రేటుకు అంగీకరించాలి. అలాగే.. అప్పు తీసుకున్న నగదు ప్రకారం బంగారాన్ని తాకట్టులో పెట్టాలి. అయితే.. ఫిన్​టెక్​ లెండర్స్​లో గోల్డ్​ లోన్​ ఇచ్చేందుకు పలు భాగస్వామ్య బ్యాంకులు ఉంటాయి. దీని ద్వారా వడ్డీ రేటు, తనఖా పెట్టాల్సిన బంగారం వంటి అంశాలను వివిధ బ్యాంకులతో పోల్చి చూసుకుని లోన్​ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. రుపీక్​ లెండర్​.. ఫెడరల్​ బ్యాంక్, కరూర్​ వైశ్య బ్యాంక్​, సౌత్​ఇండియన్​ బ్యాంక్​ భాగస్వామ్యంతో పని చేస్తోంది. అలాగే.. రప్టాక్​.. సీఎస్​బీ బ్యాంక్​, ఫిన్​కేర్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​తో జట్టు కట్టింది. వడ్డీ రేటు, బంగారం ఆభరణాల మదింపు ధర భాగస్వామ్య బ్యాంకులను బట్టి మారుతుంది.

బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఎలా వసూలు చేస్తారు?: రుణాలు అందించే సంస్థలను బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. ఫిన్​టెక్​ సంస్థ రుపీక్​లో గోల్డ్​ లోన్​ తీసుకోవాలనుకుంటే.. 30 రోజులకోసారి వడ్డీ చెల్లించాలనుకుంటే నెలకు 0.49 శాతం(ఏడాదికి 5.88శాతం) పడుతుంది. అదే.. 60 రోజులకోసారి చెల్లించాలనుకుంటే నెలకు 1.23 శాతం( ఏడాదికి 14.76శాతం), వ్యవధి ముగిసిన తర్వాత ఒకేసారి చెల్లించాలనుకుంటే నెలకు 1.65 శాతం( ఏడాదికి 19.8శాతం) వడ్డీ వసూలు చేస్తారు.

అలాగే, ఐఐఎఫ్​ఎల్​లో వడ్డీ రేట్లు ఏడాదికి 6.48 శాతం నుంచి 27శాతం వరకు ఉంటాయి. రుణ మొత్తం, కాల వ్యవధి, తనఖా పెట్టే బంగారం స్వచ్ఛతను బట్టి సైతం వడ్డీ రేటు మారుతుంటుంది. మీరు రుణాన్ని యాప్​ ద్వారా లేదా వెబ్​సైట్​ ద్వారా చెల్లించవచ్చు. డెబిట్​ కార్డు, నెట్​ బ్యాంకింగ్​, యూపీఐ, ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​, ఐఎంపీఎస్​ వంటి సౌకర్యం కూడా ఉంటుంది.

తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎలా నిల్వ చేస్తారు?: బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు తాకట్టు పెట్టిన బంగారాన్ని సెక్యూరిటీ, సీసీటీవీల నిఘాలోని లాకర్లలో దాచి ఉంచుతారు. ఫిన్​టెక్​ సంస్థలు తమ భాగస్వామ్య బ్యాంకుల లాకర్లలో నిల్వ చేస్తాయి. ధండర్​ గోల్డ్​, రుపీక్​ వంటివి బంగారానికి న్యూ ఇండియా అస్యూరెన్స్​ వద్ద బీమా చేయిస్తాయి. అలాగే.. రణగ్రహీతకు, ప్రీమియం చెల్లింపులకు బీమా సౌకర్యం అందిస్తారు. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత నేరుగా మీ ఇంటికే వచ్చి బంగారాన్ని అందజేస్తారు. బంగారాన్ని చేరవేసే క్రమంలో మార్గ మధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నష్టపోకుండా బీమా ఉంటుంది.

బంగారం రుణాలను ముందే చెల్లించవచ్చా?: బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని వ్యవధి కన్నా ముందే చెల్లించేందుకు ఆర్థిక సంస్థలు అనుమతిస్తున్నాయి. మూడు నెలల్లోపే రుణం చెల్లించి ఖాతాను మూసివేయాలనుకుంటే 2 శాతం ప్లస్​ జీఎస్​టీని ఛార్జ్​ చేస్తాయి. మూడు నెలలు దాటిన తర్వాత అయితే, ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఖాతాను మూసివేయవచ్చు.

బంగారం రుణాన్ని చెల్లించలేకపోతే పరిస్థితి ఏమిటి?: వ్యవధిలోపు రుణం చెల్లించలేకపోతే.. రుణదాత మీకు గుర్తు చేస్తూ లేఖ రాస్తారు. జరిమానా విధిస్తారు. ఏడాది, ఆపైన రుణం చెల్లించకపోతే 2 శాతం వరకు పెనాల్టీ విధిస్తాయి బ్యాంకులు. బ్యాంకులు పలు సార్లు హెచ్చరించినప్పటికీ మీరు రుణం చెల్లించకపోతే.. తాము ఇచ్చిన అప్పును తిరిగి రాబట్టుకునేందుకు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేస్తారు. ఇది మీ క్రెడిట్​ స్కోర్​, హిస్టరీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇదీ చూడండి: 'ఫిక్స్​డ్​ డిపాజిట్'​పై అధిక వడ్డీ కావాలా? ఇలా చేయండి!

టాటా నుంచి సూపర్​ 'స్మార్ట్ కార్'- అర గంట ఛార్జింగ్​తో 500కి.మీ జర్నీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.