Diwali Car Discount 2023 : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మహీంద్రా, సుజుకీ, జీప్, సిట్రోయెన్, స్కోడా ఈ దీపావళి సందర్భంగా తమ లేటెస్ట్ మోడల్ కార్లపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Diwali Offers On Mahindra Cars : ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్ర.. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆ కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
Mahindra Bolero Neo Diwali Offer : మహీంద్రా బొలెరో కారుపై భారీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ప్రకటించింది సంస్థ. మహీంద్రా TUV300 మోడల్ కారును కంపెనీ రీబ్రాండ్ చేసి బొలెరో నియోగా (Mahindra Bolero Neo) మార్చింది. ఈ కారులో ఒరిజినల్ బొలెరో కారు కన్నా మరిన్న ఫీచర్లను పొందుపర్చారు. 1.5 లీటర్ త్రీ సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు.. 100hp పవర్, 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ దీపావళికి ఈ సెవెన్ సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన వారికి భారీ డిస్కౌంట్స్‌తో అందిస్తున్నారు. మహీంద్రా డీవల్స్.. బొలెరో నియో కారు కొనుగోలు చేసినవారికి రూ.50,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తారు.
Mahindra Bolero Diwali Offer : మహీంద్రా కంపెనీలో 'వర్క్‌హార్స్'గా పిలిచే మరో వాహనం మహీంద్రా బొలెరో. 2000వ సంవత్సరంలో కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఈ కారు సేల్స్‌లో దూసుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో ఈ మోడల్లో చాలా ఫేస్‌లిఫ్ట్ తీసుకువచ్చారు. ఇక కొత్త భద్రత నింబధనల ప్రకారం ఈ కారులో 1.5 లీటర్ త్రీ సిలిండర్ mHawk డీజిల్ ఇండిన్ను పొందుపర్చారు. 76hp పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ వర్క్హార్స్పై.. దిపావళి సందర్భంగా రూ.70,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు.
Mahindra XUV300 Diwali Offer : మహీంద్రా టాటా నెక్సాన్‌కు పోటీగా XUV300ను లాంచ్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ 110hp పెట్రోల్, 130hp పెట్రోల్, 117hp డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందులోబాటులో ఉంది. ఈ కారును కొనుగోలు చేసిన వారికి రూ.1,20,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
Mahindra XUV400 Diwali Offer : మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ కారును కొనుగోలు చేసిన వారికి రూ.3,50,000 వరకు బినిఫిట్స్ అందిస్తున్నారు.
Maruti Suzuki Jimny Zeta Diwali Offer : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కార్లపై దిపావళి ఆఫర్స్ ప్రకటించింది. అందులో ముఖ్యంగా కంపెనీ టాప్ అడ్వెంచర్ కారు జిమ్మీ జెటాపై భారీ ఆఫర్స్ ప్రకటించింది. 1.5-లీటర్ K15B పవర్ఫుల్ పెట్రోల్ ఇంజిన్‌తో జిమ్మి జెటాని అందుబాటులోకి తెచ్చారు. స్టీల్ వీల్స్‌తో వస్తున్న జిమ్మి జెటాలో.. 7.0 టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రామ్) ఉన్నాయి.
ముఖ్యంగా ఈ జిమ్మి జెటా కొనుగోలు చేసిన వారికి రూ.50,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తారు. ఇక రూ.50,000 ఎక్స్ఛేంజ్ లేదా లాయల్టీ బోనస్ ఆఫర్ లభిస్తుంది. జిమ్మి జెటా మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Volkswagen Taigun Diwali Offer : ఈ దీపావళికి ప్రముఖ కారు బ్రాండ్ ఫోక్స్‌వేగన్ కూడా ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యమంగా తమ ఫ్లీట్‌లోని ఫోక్స్‌వేగన్ టైగన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 1.0-లీటర్, 1.5-లీటర్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్న ఈ టైగన్‌పై రూ.10,0000 వరకు డిస్కౌంట్స్ లిభిస్తున్నాయి. అయితే టాప్ వేరియంట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బేస్ లేదా లోయర్ లెవెల్ వేరియంట్లకు రూ.65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు.
Jeep Meridian Diwali Offer : కారు మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ జీప్.. ఈ దిపావళికి తమ కంపెనీ కార్లపై ఆఫర్స్ ప్రకటించింది. ముఖ్యంగా జీప్ మెరీడియన్ మోడల్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారుపై రూ.1,00,000- రూ1,30,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
Jeep Compass Diwali Offer : జీప్ నుంచి వచ్చిన మేడిన్ ఇండియా కారు జీప్ కాంపాస్. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారుపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ జీప్ కాంపాస్ కొనుగోలు చేసిన వారికి రూ.1,45,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు.
Skoda Kushaq Diwali Offer : కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో స్కోడా నుంచి కుషక్ మోడల్ పోటీ పడుతోంది. స్కోడా కుషగ్ టాప్ వేరియంట్లను కొనుగోలు చేసిన వారికి రూ.1,50,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తారు.
Citroen C5 Aircross Diwali Offer : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సిట్రోయెన్.. ఈ దీపావళి పండుగ సందర్భంగా Citroen C5 Aircross కారుపై భారీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ కారు 2022 ఫేస్‌లిఫ్ట్ ధర ప్రస్తుతం రూ.37.67 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. 177hp పవర్, 400Nm టార్క్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఇంజిన్‌తో వస్తున్న ఈ కారును కొనుగోలు చేసిన వారికి రూ.2,00,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
స్టన్నింగ్ ఫీచర్స్‌తో నవంబర్‌లో విడుదల కానున్న సూపర్ కార్స్ & బైక్స్ ఇవే!