ETV Bharat / business

డెల్ ఉద్యోగులకు షాక్​.. వేల మందికి లేఆఫ్​.. ఇన్ఫోసిస్​లోనూ..

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మరో సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ టెక్నాలజీస్​.. 6,650 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, ఇన్ఫోసిస్ కూడా 600 ఫ్రెషర్ ఉద్యోగులపై వేటు వేసింది.

dell layoffs
డెల్​లో ఉద్యోగులకు ఉద్వాసన
author img

By

Published : Feb 6, 2023, 3:20 PM IST

Updated : Feb 6, 2023, 3:52 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో డెల్‌ టెక్నాలజీస్‌ 6,650 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డెల్‌ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5శాతం. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ కో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్క్‌ వెల్లడించారు.
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పీసీల విక్రయాలు గణనీయంగా పడిపోయినట్లు ప్రముఖ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐడీసీ తెలిపింది. డెల్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 37 శాతం పడిపోయినట్లు వెల్లడించింది. 2022లో టెక్‌ రంగంలో 97,171 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ ఛాలెంజర్‌ తెలిపింది. 2021తో పోలిస్తే ఉద్యోగ కోతలు 649 శాతం పెరిగినట్లు పేర్కొంది.

ఇన్ఫోసిస్​లోనూ..
సాఫ్ట్​వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్​ 600 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలో ఫెయిలయినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది 2022 జులైలో నియమితులైనవారేనని పేర్కొంది. ఉద్వాసనకు గురైన 600 మందిలో 280 మందిని రెండు వారాల క్రితం తొలగింపునకు గురైనట్లు వెల్లడించింది.

"నేను గతేడాది ఆగస్టులో ఇన్ఫోసిస్​ సంస్థలో ఉద్యోగంలో చేరాను. మా బ్యాచ్​లో మొత్తం 150 మంది. అందులో ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలో 60 మంది మాత్రమే పాసయ్యారు. మిగతావారు రెండు వారాల కిందటే తొలగింపునకు గురయ్యారు."

--తొలగింపునకు గురైన ఉద్యోగి

Last Updated : Feb 6, 2023, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.