ETV Bharat / business

Damaged Currency Exchange : మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా?.. సింపుల్​గా మార్చుకోండిలా! - business news in telugu

Damaged Currency Exchange In Telugu : డిజిటల్ లావాదేవీల వల్ల నోట్ల వాడకం బాగా తగ్గింది. నోట్ల వాడకం తగ్గినా కూడా, అడపా దడపా చిరిగిన నోట్లు మన కంటపడుతూనే ఉంటాయి . అయితే వాటిని ఎలా మార్చుకోవాలో చాలా మందికి తెలీదు. అందుకే పాడైపోయిన, చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

torn currency notes exchange rules in india
Damaged Currency Exchange
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 3:50 PM IST

Damaged Currency Exchange : నగదు లావాదేవీలు జరిపినప్పుడు, చాలా మటుకు పాడైపోయిన లేదా చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ నోట్లతో ఏదైనా కొనాలని చూస్తే, దుకాణదారులు ఆ పాడైపోయిన కరెన్సీ నోట్లని తీసుకోవడానికి ఒప్పుకోరు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు.. చిరిగిన నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇవ్వడానికి కమీషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇలా ఎవరికీ కమీషన్​ చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి.. పాత లేదా చిరిగిన లేదా పాడైపోయిన నోట్లు ఇచ్చి, కొత్త నోట్లు పొందవచ్చు. ఇందుకోసం మీరు ఏదైనా పబ్లిక్ లేదా ప్రైవేట్ బ్యాంక్​కు వెళ్ళి, మీ పాత లేదా పాడైన కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్​బీఐ నిబంధనల ప్రకారం, ఏ బ్యాంక్ కూడా నోట్ల మార్పిడిని నిరాకరించడానికి వీలు లేదు. కరెన్సీ నోట్ల బదిలీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలని రూపొందించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నోట్ల మార్పిడికి ఉన్న నియమాలు ఏమిటి?
Torn Currency Exchange : ఆర్​బీఐ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకసారికి కేవలం 20 నోట్లు మాత్రమే మార్చుకోగలరు. అంటే, మీరు 20 కంటే ఎక్కువ నోట్లని ఒకేసారి మార్చుకోలేరు. అంతేకాకుండా ఆర్​బీఐ చిరిగిన నోట్ల విలువ మీద కూడా ఒక పరిమితి విధించింది. మీరు ఒకేసారి 20 నోట్లను మార్పిడి చేసినా.. దాని గరిష్ఠ విలువ రూ.5000 మించకూడదు. సాధారణంగా పరిమితిలోపు పాడైన కరెన్సీ నోట్లను బ్యాంకులు స్వీకరించి.. ఆ విలువకి సరిపడా కొత్త నోట్లని వెంటనే ఇస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ నోట్లు ఉంటే.. బ్యాంక్ వెంటనే మార్పిడి చేయదు. ముందుగా మీ పాత నోట్లని స్వీకరించి.. తరువాత ఆ డబ్బుని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.

భద్రతా గుర్తులు తప్పక ఉండాలి!
Indian Currency Security Symbols : బ్యాంకులు.. సీరియల్ నంబర్స్, మహాత్మా గాంధీ వాటర్ మార్క్, గవర్నర్ సంతకం లాంటి భద్రతా గుర్తులు (సెక్యూరిటీ సైన్) ఉన్న కరెన్సీ నోట్లను మాత్రమే మార్పిడి చేస్తాయి. ఒకవేళ, మీ నోట్లపై ఈ భద్రతా గుర్తులు లేకపోతే, బ్యాంకులు వాటిని తీసుకోవు. మీరు కచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. బ్యాంకులు పాడైన నోట్లని మార్చడానికి ఎలాంటి కమీషన్ తీసుకోవు. మరో ముఖ్య విషయం.. మీరు ఎక్కడైతే మీ పాత కరెన్సీ నోట్లు మార్చాలని అనుకుంటున్నారో.. ఆ బ్రాంచ్​లో మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు.

పూర్తిగా చిరిగిపోయిన నోట్లను కూడా మారుస్తారా?
Torn Currency Note Damage Percentage in India : ఒకవేళ మీరు బాగా పాడైనా, బాగా కట్ అయినా, లేదా బాగా చిరిగి పోయిన కరెన్సీ నోట్లను బ్యాంకుకు ఇస్తే.. బ్యాంకులు ఆ కరెన్సీ నోట్ల విలువకు సరిపడే డబ్బును తిరిగి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర చిరిగిన రూ.200 నోటు ఉందనుకోండి. ఆ నోటులో 78 చదరపు సెం.మీ సరిగా ఉంటే, మీకు మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. ఒకవేళ 39 చదరపు సెం.మీ మేర ఆ కరెన్సీ నోటు పాడైతే, మీరు కేవలం సగం డబ్బు మాత్రమే పొందుతారు. ఇదే సూత్రం ఇతర కరెన్సీ నోట్లకు కూడా వర్తిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.