ETV Bharat / business

మీకు బెస్ట్ క్రెడిట్ కార్డు కావాలా? అయితే ఇలా ఎంపిక చేసుకోండి! - క్రెడిట్​ కార్డు అర్హతలు

క్రెడిట్‌ కార్డుల వినియోగం ఈ మధ్య అధికమైంది. అయితే, మీరు బెస్ట్ క్రెడిట్ కార్డునే ఎంచుకుంటున్నారా? సాధారణంగా మనం బ్యాంక్‌ లేదా థర్డ్‌ పార్టీ కంపెనీలు ఏ కార్డుని ఆఫర్‌ చేస్తే ఆ కార్డునే తీసుకుంటుంటాం. కానీ, అది సరైన పద్ధతి కాదు. మీ అవసరం, వినియోగించే తీరును బట్టి కార్డును తీసుకోవాలి. బెస్ట్​ క్రెడిట్​ కార్డులు ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.

how to select the best credit card
how to select the best credit card
author img

By

Published : Mar 26, 2023, 1:29 PM IST

చాలా మందికి.. మీరు క్రెడిట్​ కార్డు తీసుకుంటారా? అని వివిధ బ్యాంకుల నుంచి ఫోన్​కాల్స్​ వస్తుంటాయి. ఏదైనా బ్యాంకుకు వెళ్లినా.. అక్కడ కూడా బ్యాంకు ఉద్యోగులు క్రెడిట్​ కార్డు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతారు. నిజానికి ఆ క్రెడిట్​ కార్డు ఆఫర్లు.. మన ఆదాయం, క్రెడిట్​ స్కోరు, ఖర్చు తీరు మీద ఆధారపడి ఉంటాయి. మెదటిసారి క్రెడిట్‌ కార్డు తీసుకునేవారికైతే.. బేసిక్​ బెనిఫిట్స్​తో కూడిన కార్డును ఆఫర్‌ చేస్తారు. ఇదివరకే వాడుతున్న వారికి.. వారి క్రెడిట్‌ హిస్టరీ ఆధారంగా చేసుకొని మరిన్ని అధిక ప్రయోజనాలున్న కార్డును ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపిస్తాయి. వివిధ సంస్థలు రకరకాల ప్రయోజనాలను అందిస్తుంటాయి. మరి వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

మీ అర్హత ఏంటి?
క్రెడిట్​ కార్డు పొందడానికి ముఖ్యంగా కావాల్సినవి ఆదాయం, క్రెడిట్​ స్కోరే. మన స్థిర ఆదాయం, 750 కంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే క్రెడిట్​ కార్డు ఈజీగా పొందవచ్చు. గతంలో ఎలాంటి రుణం తీసుకోకుండా.. క్రెడిట్‌ కార్డు వాడకుండా ఉంటే సుదీర్ఘ క్రెడిట్‌ చరిత్ర ఉండదు. దీనికి తోడు అస్థిర ఆదాయం ఉంటే​ కార్డు పొందడం కష్టతరమవుతంది. దీనికి పరిష్కారంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఆధారంగా చేసుకొని కార్డు పొందొచ్చు.

ఖర్చులకు అనుగుణంగా ప్రయోజనాలు..
ఆదాయాన్ని, క్రెడిట్‌ స్కోర్​ను ఆధారంగా చేసుకొని మీరు ఒకటి కన్నా ఎక్కువ కార్డులు పొందేందుకు అర్హులు అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు క్రెడిట్​​ కార్డు ద్వారా మీరు ఎలా ఖర్చుచేయాలనుకుంటున్నారు అన్నది కీలకం. మీరు కోరుకున్న లైఫ్​ స్టైల్​ అనుభవించడానికి కార్డు ఉపయోగకరంగా ఉండాలి. అంటే, మీ అవసరాలు, కోరికలకు అనుగుణంగా కార్డు ప్రయోజనాలు ఉండాలి. ఖర్చు ఎక్కడ ఎక్కువ అవుతుంది? ఎక్కడెక్కడ క్రమంగా డబ్బులు వెచ్చిస్తారు? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు తరచూ ప్రయాణాలు చేయొచ్చు లేదా షాపింగ్​ చేయాల్సి రావచ్చు. వ్యాపారులైతే క్లైంట్లతో మీటింగులప్పుడు రెస్టారెంట్లకు వెళ్తుండొచ్చు. ఇలాంటి ప్రదేశాల్లో మీకు కార్డు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి. అలాంటి ప్రయోజనాలు కల్పించే క్రెడిట్​ కార్డునే సెలెక్ట్​ చేసుకోవాలి.

వృథాని నివారించాలి..
ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించడానికి కంపేనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి ఎన్ని ఆకర్షణలున్నా.. మన అవసరాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేదే ప్రధానం. ఉదాహరణకు కొవిడ్‌ సమయంలో మనం ఎటూ వెళ్లలేని పరిస్థితి. అప్పుడు ప్రయాణాలపై రాయితీలు, టికెట్‌ బుకింగ్‌లపై తగ్గింపు, ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్‌ యాక్సెస్‌ వంటి ప్రయోజనాలున్న కార్డుని తీసుకొని ఉంటే.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొంది ఉండేవాళ్లం కాదు. అప్పుడు ఆన్‌లైన్‌ షాపింగులపై ఆఫర్లు.. రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్​ కార్డు ఉంటే ఎంతో ఉపయోగపడేది. ఇప్పుడొస్తున్న అనేక కార్డులు.. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే షాపింగ్​పై అనేక రాయితీలు, తగ్గింపులను ఆఫర్‌ చేస్తున్నాయి. కానీ, అవన్నీ మనకు ఎంతమేర అవసరం అవుతాయి? వాటిని మనం ఎంతవరకు ఉపయోగిస్తామో చూసుకోవాలి.

ఉచితమా లేక ప్రీమియం తీసుకోవాలా?
కొన్ని క్రెడిట్​ కార్డులు ఉచితంగా ఇస్తారు. కానీ కొన్ని కార్డులకు వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ప్రీమియం ప్రయోజనాలు పొందాలంటే.. రుసుము చెల్లించాల్సిందే. ఫ్రీ మూవీ టికెట్స్ నుంచి ఎయిర్​పోర్టుల్లో అపరిమిత లాంజ్‌ యాక్సెస్‌, లగ్జరీ హోటళ్లలో స్టే వరకు.. ఆ కార్డు రకం, మనం చెల్లించే ఛార్జీని బట్టి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఈ ప్రయోజనాలన్నీ మనం చెల్లించే వార్షిక ఛార్జీలపై ఆధారపడి ఉంటాయి. ఎంత ఎక్కువ రుసుము చెల్లిస్తే అన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. కొన్ని సార్లు కార్డుపై నిర్దేశించిన మొత్తం డబ్బుల్ని ఖర్చు చేస్తే.. రుసుమును రద్దు చేస్తుంటారు. మరి ఉచిత క్రెడిట్​ కార్డు తీసుకోవాలా? లేక ప్రీమియం కార్డు తీసుకోవాలా? అనేది మన అవసరాలు, లక్ష్యాలు, ఖర్చు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.

ఒక బ్రాండ్​లు అంటే మీకు ఇష్టమా?
చాలా మందికి ఒకసారి ఓ బ్రాండ్ నచ్చితే పదే పదే ఆ బ్రాండ్​కు సంబంధించిన వస్తువులే కొంటుంటారు. అలా షాపింగ్‌, ప్రయాణం, ఇంధన, ఫుడ్​.. లాంటి తదితర కెటగిరీలకు వర్తించే కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు కూడా అందుబాటులో ఉంటాయి. ఒక బ్రాండ్‌పై మీకు నమ్మకం ఉంటే.. ఆ బ్రాండ్​లో మీరు చేసే కొనుగోళ్లపై ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే.. కో-బ్రాండెడ్‌ కార్డులను సెలెక్ట్​ చేసుకోవచ్చు. దాంతో మీకు నచ్చిన బ్రాండ్‌పై కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. ఇలా కాకుండా ఏ బ్రాండ్​ అయినా కొనుగోలు చేయాలనుకుంటే కో-బ్రాండెడ్‌ కార్డుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

మీరు తీసుకోబోయే క్రెడిట్‌ కార్డులపై లభించే రివార్డులు, ఆఫర్ల గురించి కచ్చితంగా ముందే తెలుసుకోవాలి. పైగా కార్డుని తరచూ ఉపయోగిస్తేనే రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. మనం చేసే ఖర్చులు కార్డుపై నిర్దేశించిన లిమిట్​ను దాటితే.. ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. అంతే కాకుండా క్రెడిట్​ కార్డులు మీకు ఎలా ఉపయోగపడతాయి.. వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటేనే.. ఏ కార్డు తీసుకోవాలో అనే విషయంలో స్పష్టత వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.