ETV Bharat / business

క్రెడిట్‌ కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ ఫెసిలిటీతో అన్నీ క్లియర్​! - Credit Card Balance Transfer Details in Telugu

Credit Card Balance Transfer : చేతిలో డ‌బ్బు లేకుండా ఏదైనా వ‌స్తువు కొనాలంటే వెంటనే గుర్తొచ్చేది క్రెడిట్ కార్డు. ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. అయితే.. ఒక్కోసారి రీ-పేమెంట్ భారంగా మారొచ్చు. ఇలాంటి సమయంలో డీ-ఫాల్ట్​ కాకుండా.. క్రెడిట్‌ కార్డు బకాయిలను మరో క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేయొచ్చని మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Credit Card Balance Transfer
Credit Card Balance Transfer
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 1:45 PM IST

Credit Card Balance Transfer Full Details in Telugu: ఒకప్పటితో పోలిస్తే క్రెడిట్‌ కార్డుల వినియోగం ఇప్పుడు ఎక్కువైంది. కొనుగోళ్లు, వివిధ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వారికి క్రెడిట్‌ కార్డు అనుకూలమైంది. అయితే క్రెడిట్‌ కార్డుతో వ్యవహరించేటప్పుడు మంచి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మెరుగైన క్రెడిట్‌ స్కోరు పొందడానికి క్రెడిట్‌ ఖర్చులను ట్రాక్‌ చేయడం, బిల్లులను సరిగ్గా చెల్లించడం చాలా అవసరం. కానీ, ఈ కార్డులను ఉపయోగించి గడువులోగా బిల్లులు చెల్లించకుండా డిఫాల్ట్‌ అయినవారు ఉంటారు. వీరు క్రెడిట్‌ కార్డు బిల్లును గడువులోగా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బిల్లును వేరే క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు రుణ నిర్వహణలో బ్యాలెన్స్‌ బదిలీ ఒక రక్షణ ఆయుధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

విద్యార్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ అకౌంట్ - ఫ్రీగా రూ.2 లక్షల ప్రమాద బీమాతోపాటు మరెన్నో ప్రయోజనాలు!

క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ: క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌.. పేరులో ఉన్నట్టుగానే బిల్లు బ్యాలెన్స్‌ను బదిలీ చేయడం. ఉదాహరణకు మీ వద్ద రెండు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయనుకుందాం. అందులో మొదటి క్రెడిట్‌ కార్డుపై బిల్లు బకాయి ఉంది. మీ దగ్గర చెల్లించడానికి డబ్బు లేదు. అప్పుడు మీ వద్ద ఉన్న మొదటి క్రెడిట్‌ కార్డులోని బిల్లు బ్యాలెన్స్‌ను రెండో క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేసి ఆ సమయానికి బిల్లు చెల్లించేయొచ్చు. దీన్నే క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ అంటారు. కొన్నిసార్లు, కార్డు వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డు రుణాలను ఒకేసారి చెల్లించలేకపోవచ్చు. ఈ పరిస్థితిలో వారు అన్ని క్రెడిట్‌ కార్డు ఖాతాల నుంచి బకాయి ఉన్న రుణాలను ఒకే ఖాతాలోకి ఇంటిగ్రేట్​ చేయొచ్చు. అనేక బ్యాంకులు క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. కార్డు జారీ సంస్థ ఈ సేవను అందిస్తేనే ఈ సదుపాయాన్ని పొందగలరు. అయితే ఎక్కువ క్రెడిట్‌ కార్డులను కలిగి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఈజీగా వినియోగించుకోవచ్చు.

వర్చువల్ క్రెడిట్ కార్డ్స్​తో ఆన్​లైన్ ఫ్రాడ్స్​కు చెక్​! బెనిఫిట్స్ & లిమిట్స్​ ఇవే!

బ్యాలెన్స్‌ ట్రాన్స్​ఫర్​ ఎలా చేయాలి?: క్రెడిట్‌ కార్డు వినియోగదారులు బ్యాలెన్స్‌ బదిలీ కోసం నెట్‌ బ్యాంకింగ్‌, ఆయా క్రెడిట్‌ కార్డుల కస్టమర్‌ కేర్‌ను సంప్రదించొచ్చు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డులో క్రెడిట్‌ పరిమితి ఎక్కువగా ఉంటే ట్రాన్స్​ఫర్​కు ఈజీగా ఉంటుంది. ఒకవేళ పరిమితి తక్కువగా ఉన్నట్లయితే మీ బకాయి మొత్తాన్ని బదిలీ చేయలేకపోవచ్చు. భారత్‌లోని చాలా ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులను ఒక క్రెడిట్‌ కార్డు నుంచి మరొక బ్యాంకు క్రెడిట్‌ కార్డుకు బ్యాలెన్స్‌ బదిలీ చేయడానికి అనుమతిస్తాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌, హెచ్‌ఎస్‌బీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు బ్యాలెన్స్‌ బదిలీని ఆమోదిస్తున్నాయి.

బ్యాలెన్స్‌ బదిలీ ప్రయోజనం: గడువులోగా క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించనప్పుడు డీఫాల్ట్ అంటారు. దీనివల్ల జరిమానా, వడ్డీ కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. క్రెడిట్‌ స్కోరుపై కూడా దీని ప్రభావం ఎక్కువే. కానీ, ఆ సమయంలో బ్యాలెన్స్‌ బదిలీ అవకాశాన్ని ఎంచుకుంటే ఈ పరిస్థితి నుంచి కొన్ని రోజుల పాటు గట్టెక్కొచ్చు. మొదటి కార్డు బిల్లు బ్యాలెన్స్‌ రెండో కార్డుకు బదిలీ అవుతుంది కాబట్టి, డబ్బులు కొన్ని రోజుల్లో సర్దుబాటు చేసి రెండో కార్డుపై బదిలీ అయిన అప్పును తీర్చేయొచ్చు. దీనివల్ల డిఫాల్ట్‌ అవ్వకుండా తాత్కాలికంగా బయటపడొచ్చు. మీరు క్రెడిట్‌ కార్డు బిల్లులను చెల్లించలేనప్పుడు క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ మీకు రక్షణగా ఉంటుంది. బకాయి చెల్లింపుల చరిత్ర, లావాదేవీ విధానాలు, ఖర్చులకు సంబంధించి మంచి చరిత్ర ఉంటే, మీరు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్‌ బదిలీకి అర్హులు అవుతారు.

న్యూ ఇయర్ షాపింగ్ చేయాలా? ఇలా చేస్తే క్రెడిట్ కార్డ్​ బెనిఫిట్స్ పక్కా!

రుసుములు, వడ్డీ: బ్యాలెన్స్‌ బదిలీ సేవలపై రుసుములు, వడ్డీ అమలవుతాయి. ఈ సేవలపై 1-5% వరకు ప్రాసెసింగ్‌ రుసుము ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ ఫీజు (రుసుము)ను కూడా వసూలు చేస్తాయి. నిర్దేశిత కాలానికి బ్యాలెన్స్ బదిలీపై వడ్డీ వర్తించదు. కానీ, నిర్దేశిత కాలపరిమితి దాటిన తర్వాత వడ్డీ రేటు సాధారణంగా నెలకు 1% నుంచి ప్రారంభమవుతుంది. బ్యాలెన్స్‌ బదిలీ దరఖాస్తును సమర్పించే ముందు బ్యాంకుతో అన్ని నిబంధనలు, వడ్డీ రేట్లు నిర్ధారించడం చాలా ముఖ్యం. ఇవి బ్యాంకును బట్టి మారతాయి.

ఎవరికి ప్రయోజనం?: తక్కువ సమయంలో రుణం లభించలేని పరిస్థితుల్లో ఉన్నవారు, ఇప్పటికే అధిక వడ్డీలతో రుణ భారం ఉన్న కార్డు వినియోగదారులు తమ బకాయిలను చెల్లించడానికి బ్యాలెన్స్‌ బదిలీని ఎంచుకోవచ్చు. బకాయి మొత్తాన్ని పరిమిత నెలల లోపు చెల్లించగలిగినప్పుడు ఈ బ్యాలెన్స్‌ బదిలీ అనువైనది.

​బెస్ట్ క్యాష్​బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్ కావాలా? ఈ టాప్​-5 క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి!

ఇబ్బందులు: తరచుగా బ్యాలెన్స్‌ బదిలీ అవకాశాన్ని ఎంచుకుంటే క్రెడిట్‌ స్కోరు తగ్గే అవకాశం ఉంది. కొత్త క్రెడిట్‌ కార్డుల ఆమోదం కష్టమౌతుంది. బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి కొత్త క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తే, బ్యాంకు మీ క్రెడిట్‌ నివేదికపై కఠినమైన క్రెడిట్‌ విచారణను నిర్వహిస్తుంది. ప్రతి విచారణ మీ క్రెడిట్‌ స్కోరును కొన్ని పాయింట్లు తగ్గేలా చేస్తుంది.

SBI నుంచి కొత్త క్రెడిట్‌ కార్డ్‌- ప్రతి ట్రాన్సాక్షన్‌ పైనా క్యాష్‌బ్యాక్! ఇంకా ఎన్నో!

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్​ కార్డ్​తో సింపుల్​గా చెక్​ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.