Can I Get Gratuity Before 5 Years : గ్రాట్యుటీ.. ఒకే సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరంతరాయంగా పనిచేసి.. అనంతరం అక్కడ ఉద్యోగం మానేసి వెళుతున్న వారికి సదరు కంపెనీ ఇచ్చే మొత్తం. అయితే ఈ మొత్తాన్ని తీసుకునేందుకు ఐదేళ్ల పాటు పనిచేసిన వారే అర్హులా? అంతకంటే తక్కువ పనిచేసిన వారు ఈ గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకోలేరా? ఈ విషయంలో అటు సంస్థ యాజమాన్యం.. ఇటు ఉద్యోగి కాస్త గందరగోళంలో ఉంటారు. మరి గ్రాట్యుటీ చట్టం 1972 దీనిపై ఏం చెబుతుందో తెలుసుకుందాం.
Gratuity Eligibility Period in India : గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం.. నిరంతరాయంగా ఒకే సంస్థలో ఐదేళ్ల కంటే తక్కువ పనిచేసిన ఉద్యోగి కూడా ఈ మొత్తాన్ని పొందొచ్చు. 4 సంవత్సరాల 8 నెలల పాటు లేదంటే అంతకంటే తక్కువ పనిచేసిన ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ తీసుకునేందుకు అర్హులు. ఇన్ని రోజులు పాటు సంస్థకు సేవలందించిన ఉద్యోగికి.. గ్రాట్యుటీ ఇచ్చి గౌరవించాలని చట్టంలోని ఓ నిబంధన సూచిస్తోంది. ముంబయికి చెందిన ఒక ప్రముఖ న్యాయవాది కూడా ఇదే విషయాన్ని తెలిపారు. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 4(2) ప్రకారం.. ఉద్యోగి ఒకే సంస్థలో 4 సంవత్సరాల 6 నెలల పాటు నిరంతరాయంగా పనిచేస్తే.. వారు గ్రాట్యుటీ మొత్తాన్ని పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.
Gratuity Act 1972 : గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం.. కేవలం ఉద్యోగి స్వచ్ఛంద నిష్క్రమణకు మాత్రమే గ్రాట్యుటీ పరిమితం కాదని తెలుసుకోవాలి. ఉద్యోగి చనిపోయిన సందర్భంలోనూ.. సంస్థ యాజమాన్యం గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా ఉద్యోగి పనిచేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు కూడా వారు గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకోవచ్చు. పదవీ విరమణ సమయంలోనూ తాము పనిచేసిన సంస్థ యాజమాన్యం నుంచి.. గ్రాట్యుటీ పొందేందుకు ఉద్యోగులు అర్హులవుతారు. ఈ సందర్భాలలో ఉద్యోగి.. సదరు సంస్థలో కచ్చితంగా ఐదేళ్ల కాలం పాటు పనిచేయాలన్న నిబంధన ఉండదు. అయితే ఇంటర్న్షిప్ చేసేవారు, తాత్కాలిక ఉద్యోగులు గ్రాట్యుటీకి తీసుకునేందుకు వీలు లేదని తెలుసుకోవాలి.
5 Biggest Financial Mistakes: మీ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసే.. 5 పొరపాట్లు ఇవే!
Life Insurance Vs Term Insurance : లైఫ్ ఇన్సూరెన్స్ VS టర్మ్ ఇన్సూరెన్స్.. ఏది బెస్ట్ ఆప్షన్?