ETV Bharat / business

Best Post Office Saving Schemes for Boy Child : మగ పిల్లల కోసం.. పోస్టాఫీస్ 5 పొదుపు పథకాలు.. మీకు తెలుసా?

Best Post Office Child Saving Schemes in Telugu : పిలల్ల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే.. ప్రథమ కర్తవ్యంగా తల్లిదండ్రులు పనిచేస్తుంటారు. ఇలాంటి వారికోసమే.. పోస్టాఫీస్ 5 ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. ఇవి కేవలం మగ పిల్లలకు సంబంధించిన పథకాలు. మరి, ఆ పథకాలేంటి..? వాటితో కలిగే ప్రయోజనాలేంటి? అన్న వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 4:46 PM IST

Post Office Child Boy Saving Schemes
Post Office Saving Schemes for Boy Child

Post Office Saving Schemes for Boys : ఏ తల్లిదండ్రులైనా.. పిల్లలు తమలా ఇబ్బందులు పడకూడదని కోరుకుంటారు. ఇందుకోసం.. వారికి మంచి చదువులు చెప్పించడం మొదలు.. ఆర్థికంగా కూడా అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. అవకాశం ఉన్నవారు ఆస్తులు ఇస్తే.. లేని వారు కనీసం కొంత డబ్బును సేవ్ చేసేందుకైనా చూస్తారు. ఈ క్రమంలో చాలా మంది.. తమకు పిల్లలు పుట్టినప్పుటి నుంచే ఏదైనా పొదపు పథకం(Savings Scheme)లో చేరాలని భావిస్తుంటారు.

Boy Child Best Post Office Schemes : మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మంచి పెట్టుబడి స్కీమ్​ల కోసం చూస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం(Central Government) వివిధ పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలను రూపొందించింది. ఇప్పటికే.. ఆడపిల్లల కోసం అనేక పథకాలు అమలులో ఉండగా.. మగ పిల్లల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ పథకాలు ఏంటి? ఎన్ని సంవత్సరాల వారు అర్హులు? ఈ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్న వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

దేశంలో మగ పిల్లల కోసం అమలులో ఉన్న 5 ఫోస్ట్​ ఆఫీస్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. కిసాన్ వికాస్ పత్ర పథకం (Kisan Vikas Patra Scheme for Child Boy) : ఇండియా పోస్ట్ ద్వారా 1988లో ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర అనే స్కీమ్(Kisan Vikas Patra Scheme) దేశంలో తక్కువ ఆదాయంతో పాటు మధ్యతరగతి ఆదాయ కుటుంబాలకు సరిపోయే సముచితమైన ప్రణాళిక. ఇది దేశంలోని మగ పిల్లల కోసం ఒక స్వల్ఫకాలిక పోస్టాఫీసు పొదుపు పథకం. తల్లిదండ్రులను సంవత్సరానికి ఒక నిర్ధిష్ట మొత్తం డబ్బుపై పెట్టుబడి పెట్టడానికి ఈ స్కీమ్ అనుమతిస్తుంది.

కిసాన్ వికాస్ పత్ర (KVP) ప్లాన్ వివరాలు :

Kisan Vikas Patra Scheme Features :

  • 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ఈ పథకానికి అర్హులు.
  • ఒకవేళ 18 ఏళ్లు నిండని వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఈ పాలసీకి అప్లై చేసుకోవచ్చు.
  • కనీస పెట్టుబడి మొత్తం- రూ.1000, గరిష్ఠంగా పెట్టుబడి మొత్తం- No Upper Limit.
  • జూన్ 2023 నాటికి ఈ పథకంలో సంవత్సరానికి వడ్డీ రేటు-7.9%.
  • అత్యవసర పరిస్థితుల్లో మీరు ఈ స్కీమ్​లో పెట్టిన నిధులను ముందుగానే ఉపసంహరించుకోవచ్చు.
  • కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ అనేది ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు.
  • మెచ్యురిటీ పీరియడ్-10 సంవత్సరాల 4 నెలలు. ఈ స్కీమ్ ద్వారా తక్కువ వడ్డీరేటుకు తల్లిదండ్రులు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది.

2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ :

National Savings Certificate : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది తక్కువ రిస్క్​, ఫిక్స్​డ్ ఇన్​కమ్ ఉన్న పథకం. దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్​లలో అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఆధారిత పథకం. పన్ను ప్రయోజనాలతోపాటు పొదుపు చేసేలా చిన్న, మధ్య ఆదాయ పెట్టుబడి దారులను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. వ్యక్తిగతంగా, ఉమ్మడిగా లేదా మైనర్ కోసం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్​ కోసం పోస్టాఫీస్​లో అప్లై చేసుకోవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ప్రయోజనాలు :

National Savings Certificate Benefits :

  • 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం.. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దీనికి అప్లై చేసుకోవచ్చు.
  • ఈ పథకం కనిష్ఠ పెట్టుబడి-రూ.1000. గరిష్ఠ పెట్టుబడిపై పరిమితి లేదు.
  • ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీరేటు సంవత్సరానికి 7.7% గా ఉంది.
  • ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ స్కీమ్​లో వడ్డీ రేట్లను సవరిస్తోంది.
  • ఎన్​ఎస్​సీ మెచ్యురిటీ కాలం- 5 సంవత్సరాలు. లాక్ ఇన్ టెన్యూర్-5 సంవత్సరాలు.
  • ఈ పథకం ద్వారా ₹1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.

Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?

3. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పాలసీ :

Post Office Monthly Income Scheme in Telugu : ఈ పథకం కూడా మగపిల్లల కోసం పోస్టాఫీస్ అందిస్తున్న పొదుపు స్కీమ్. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పథకం.. స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఇంకా.. తక్కువ రిస్క్, మంత్లీ ఇన్‌కం స్కీమ్​గా చెప్పుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం బెనిఫిట్స్

(Post Office Monthly Income Scheme Features) :

  • కనిష్ఠ పెట్టుబడి-రూ.1000, గరిష్ఠంగా రూ.4.5లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • ఈ ప్లాన్ మెచ్యురిటీ వరకు ఈ స్కీమ్ మూలధన రక్షణ అందిస్తుంది.
  • ఈ పథకంలో వడ్డీరేటు ఏప్రిల్-జూన్ 2023 నాటికి 7.40%గా ఉంది. నెలవారిగా ఇందులో వడ్డీ చెల్లింపులు ఉంటాయి.
  • మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ప్లాన్ పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని అనుమతిస్తుంది.
  • TDS వర్తించదు. కానీ, పెట్టుబడి పెట్టిన మొత్తం సెక్షన్ 80C కింద కవర్ చేయబడదు.

4. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం :

Post Office Recurring Deposit : దేశంలో మగపిల్లల కోసం పోస్టాఫీస్ అందిస్తున్న మరొక మంచి డిపాజిట్ స్కీమ్. బ్యాంక్‌లో సాధారణ పొదుపు ఖాతాతో పోలిస్తే ఇది అధిక వడ్డీ రేటును అందించే రికరింగ్ డిపాజిట్ ప్లాన్. ఈ పథకం కింద తల్లిదండ్రులు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని ఖాతాలో ఆదా చేసుకోవచ్చు.

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం ప్రయోజనాలు :

  • ఈ పథకం కాలవ్యవధి 5 సంవత్సరాలు. లాక్ ఇన్ పీరియడ్ 3 నెలలు.
  • కనిష్ఠ పెట్టుబడి రూ.100, గరిష్ఠ పెట్టుబడిపై పరిమితి లేదు.
  • ఈ స్కీమ్​లో ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 5.8%గా ఉంది.
  • నామినీని జోడించడానికి కూడా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనుమతిస్తుంది
  • మీరు ఈ ప్లాన్ నుంచి మీ పొదుపు ఖాతాకు నిధులను బదిలీ చేయవచ్చు.
  • తల్లిదండ్రులు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఖాతాలో ఆదా చేసుకోవచ్చు.

5. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ :

Public Provident Fund : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే స్కీమ్ పన్నులను ఆదా చేయడానికి రూపొందించబడిన మగ పిల్లల పథకం. ఈ స్కీమ్ కూడా తక్కువ-రిస్క్ ప్లాన్ పథకం. ఇందులోనూ నామినేషన్ సదుపాయం ఉంటుంది. PPF అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో లభించే పెట్టుబడిపై మంచి రాబడిని అందిస్తుంది.

పీపీఎఫ్ ప్రయోజనాలు(PPF Benefits) :

  • ఈ స్కీమ్​లో కనిష్ఠ పెట్టుబడి రూ.500, గరిష్ఠంగా రూ.1.5లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • PPF 15 సంవత్సరాల లాక్ ఇన్ పదవీకాలంతో వస్తుంది.
  • ఈ సమయం ముగిసిన తర్వాత తల్లిదండ్రు ఈ స్కీమ్ కాల వ్యవధిని 5 ఏళ్లు పొడిగించవచ్చు.
  • ఈ పథకంలో మైనర్ పేరుతో ఖాతా తెరవవచ్చు. కానీ.. పెద్దలు దీనిని నిర్వహించాలి.
  • మూడో సంవత్సరంలో ప్రారంభమయ్యే ఆస్తులపై రుణాలు తీసుకోవడానికి ఈ స్కీమ్ అనుమతిస్తుంది.
  • ఈ స్కీమ్​లో జూన్ 2023 నాటికి వడ్డీ రేటు 7.1%గా ఉంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఇది మారుతుంది.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం ఈ పథకం ద్వారా చేసిన పెట్టుబడులపై ₹1.5 లక్షల పన్ను ప్రయోజనాలను కూడా ఈ PPF స్కీమ్ అనుమతిస్తుంది.

Best Post Office Insurance Schemes : 299 రూపాయలకే.. రూ.10లక్షల జీవిత బీమా!

Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్​ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.