ETV Bharat / business

పిల్లల బంగారు భవిష్యత్ కోసం బెస్ట్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​ ఇదే! - best mutual funds for child education

Best Mutual Fund Plans For Your Children In Telugu : మీరు మీ పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని ఆలోచిస్తున్నారా? ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. నేడు చాలా సంస్థలు పిల్లల కోసం ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్లను అందిస్తున్నాయి. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆయే అంశాలను పరిశీలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

pros and cons of child mutual funds
Best Mutual Fund Plans for Your Children
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 5:44 PM IST

Best Mutual Fund Plans For Your Children : పిల్లలకు మంచి భవిష్యత్​ కల్పించాలని తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. అందుకోసం తమ కష్టార్జితాన్ని పణంగా పెడతారు. అయితే పిల్లల భవిష్యత్​ కోసం మ్యూచువల్ ఫండ్​ పెట్టుబడులు మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నేడు చాలా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్స్​ను అందిస్తున్నాయి. మరి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్​ ఎంచుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యా ఖర్చుల కోసం..
నేటి కాలంలో విద్య పూర్తిగా వ్యాపార వస్తువు అయిపోయింది. అందువల్ల వల్ల ఉన్నత విద్య అభ్యసించాలంటే.. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిందే. పైగా నేడు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశాలు కూడా బాగా పెరిగాయి. కనుక మీ పిల్లల చదువుల కోసం మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడం మంచిదే.

పిల్లల మ్యూచువల్​ ఫండ్స్
నేడు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు పిల్లల కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నాయి. చైల్డ్ కెరీర్ ప్లాన్​, చైల్డ్ గిఫ్ట్​ ప్లాన్ లాంటి పేర్లతో అనేక మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తెచ్చాయి. వాస్తవానికి గతంలోనూ ఇలాంటి పథకాలు ఉన్నప్పటికీ.. నేడు పెరిగిన డిమాండ్​ దృష్ట్యా మరిన్ని మ్యూచువల్ ఫండ్​ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి.

లాకిన్ పీరియడ్​
సెబీ నిబంధనల ప్రకారం, ఈ పిల్లల మ్యూచువల్ ఫండ్​లకు 5 ఏళ్ల లాకిన్‌ పీరియడ్ ఉంటుంది. లేదా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందయితే.. అప్పుడు మీ పెట్టుబడులను వెనక్కు తీసుకునే వీలుంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ పథకాలు. ప్రధానంగా ఇవి ఈక్విటీ, డెట్‌లలో మదుపు చేస్తాయి. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు రుణాలు ఇచ్చే బాండ్లలోనూ పెట్టుబడి పెడతాయి. దీని వల్ల అధిక వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా పిల్లల మ్యూచువల్​ ఫండ్స్ సురక్షితంగా ఉండేలా పోర్ట్​ఫోలియోను రూపొందిస్తాయి.

ఈ పిల్లల మ్యూచువల్ ఫండ్స్​ ఈక్విటీల్లో 65% వరకు, డెట్‌ ఫండ్లలో 35% వరకు మదుపు చేస్తాయి. కొన్నిసార్లు ఈక్విటీలకు 75% వరకు కూడా కేటాయించే అవకాశాలు ఉంటాయి.

ప్రయోజనం ఉంటుందా?
పిల్లల కోసం పెట్టుబడి పెడుతున్నాం కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్​ నుంచి తొందరపడి డబ్బులు వెనక్కి తీసుకోకూడదు. దీర్ఘకాలంపాటు ఫండ్లలో పెట్టుబడులు కొనసాగించినప్పుడే మంచి వృధ్ధికి అవకాశం ఉంటుంది. గత మూడేళ్ల కాలంలో ఈ విభాగంలోని పథకాలు సగటున 19.36 శాతం వరకు రాబడినిచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే అయిదేళ్ల కాలానికి చూస్తే సగటు వార్షిక రాబడి 12.69 శాతం వరకూ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించాలి!
మన పెట్టుబడులు మంచి వృద్ధి సాధించాలంటే.. వాటిని దీర్ఘకాలంపాటు కొనసాగించాలి. ముఖ్యంగా పిల్లల పథకాల్లో ఈ సూత్రం పాటించడం తప్పనిసరి. సెబీ 5 ఏళ్లపాటు లాకిన్‌ పీరియడ్ ఉంచడం వెనుక ఉన్న లక్ష్యం ఇదే. పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే పెట్టుబడులు ప్రారంభిస్తే.. వారు ఉన్నత చదువులకు వచ్చే నాటికి మంచి నిధి జమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టాలి.

పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలి!
మన పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈక్విటీలు, డెట్‌లో ఇవి మదుపు చేస్తాయి. ఫలితంగా నష్టభయం పరిమితంగా ఉంటుంది. మంచి రాబడి వచ్చేందుకు వీలుంటుంది. నష్టభయం భరించగలిగే శక్తి ఉన్నవారు మాత్రం ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్లను ఎంచుకోవడం మంచిది. దీనికి రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి.

నష్టాలు రావచ్చు.. కానీ
ప్రతి పెట్టుబడికీ ఎంతో కొంత నష్టభయం ఉంటుంది. పిల్లల మ్యూచువల్‌ ఫండ్లకు కూడా ఇది వర్తిస్తుంది. అధిక నష్టభయం ఉన్న చోట, రాబడి కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. వాస్తవానికి దీర్ఘకాల పెట్టుబడులపై నష్టభయం పరిమితంగా ఉంటుంది. కనుక కనీసం 7-8 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాలనే ఆలోచన ఉన్నప్పుడే వీటిని ఎంచుకోవడం మంచిది.

సెన్సెక్స్@70,000; నిఫ్టీ@21,000 - విజయ ప్రస్థానం మొదలైంది ఇలా!

2024లో లాంఛ్ కానున్న టాప్-3 SUV కార్స్ ఇవే! ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.