Best Financial Tips in Telugu : గతంలో మన తల్లిదండ్రులు కొద్దిపాటి సంపాదనతోనే ఇల్లు నెట్టుకొచ్చేవారు. పిల్లల చదువులు, ఇతర ఖర్చులన్నీ అప్పు చేయకుండానే చాకచక్యంగా నిర్వహించేవారు. కానీ.. ఇప్పుడు వేలు, లక్షలు సంపాదిస్తున్నా డబ్బు సరిపోవడం లేదనే మాట నేటి యువత నోట వినబడుతోంది. ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదు అంటున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితులను అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్ : మీరు చేస్తున్న పని ఏదైనా సరే.. మీకు వస్తున్న ఆదాయం ఎంత అన్నది ముఖ్యం. దాన్ని మీ ఖర్చులకు తగ్గట్టు వర్గాలుగా విభజించుకోవాలి. దేనికి ఎంత ఖర్చు చేయాలనేది ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. బడ్జెట్ ప్లాన్‌లాగా ఒక పుస్తకంలో పట్టిక రూపంలో రాసుకోవాలి. అంత వరకే ఖర్చు చేయాలి.
ఆర్థిక లక్ష్యాలు..: మీకు నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. ఇల్లు కొనుక్కోవడమో.. కారు తీసుకోవడమో.. ఇలా ఏదో ఒకటి పెట్టుకోవాలి. కొన్ని సమీప భవిష్యత్తులో తీర్చుకోవాల్సినవి.. కొన్ని దీర్ఘకాలంలో తీర్చుకోవాల్సినవి ఉండాలి. వాటిని చేరుకోవడానికి ఎంత డబ్బు కావాలి? నెలకు ఎంత మిగిలిస్తే.. ఎంత కాలానికి టార్గెట్ రీచ్ అవుతాం? అనే లెక్క ఉండాలి. అప్పుడు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాం. ఇలా ముందుకు సాగి ఒక చిన్న లక్ష్యాన్ని మీరు సాధిస్తే.. ఆర్థిక నిర్వహణలో మీపై మీకు నమ్మకం వస్తుంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఆఫర్ - ఫిక్స్డ్ డిపాజిట్లపై అదిరిపోయే వడ్డీ రేట్లు!
అవసరాలు, కోరికలు : కోరికలనేవి ఎన్నో ఉండొచ్చు. అవి వెంటనే తీర్చుకోకపోయినా పెద్దగా నష్టం ఉండదు. కానీ.. అవసరం మాత్రం తప్పక తీర్చుకోవాల్సి ఉంటుంది. రెంట్, కరెంట్ బిల్ వంటివి వాయిదా వేయలేం. అందుకే.. కోరికల కంటే అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
పొదుపు : మీకు ప్రతి నెలా వచ్చే ఆదాయంలో 30 శాతం డబ్బు తప్పక పొదుపు చేయాల్సిందే. మిగిలిన 70 శాతం డబ్బులోనే మీ ఖర్చులన్నీ పూర్తి చేయాలి. మీరు మొదటగా వేసే బడ్జెట్ ప్లాన్‌లోనే ఈ మేరకు అడ్జెస్ట్ మెంట్ చేసుకోవాలి. దుబారా చేసే ఖర్చులు నిర్ధాక్షిణ్యంగా తొలగించాలి. పొదుపు కోసం పక్కన పెట్టిన డబ్బులో రూపాయి కూడా తీయకూడదు. ఇలా చేస్తూ పోతే.. సర్దుకుని వాడుకోవడం అలవాటు అవుతుంది. అంతేకాదు.. ఆ దాచిన డబ్బు అత్యవసర సమయాల్లో కుటుంబాన్ని ఒడ్డున పడేస్తుంది. కాబట్టి పొదుపు అత్యవసరం.
డిసెంబర్ డెడ్‌లైన్స్ - గడువులోగా ఈ పనులన్నీ తప్పక పూర్తి చేయండి!
మాయలో పడొద్దు : ఎంత కంట్రోల్‌గా ఉన్నా.. ఒక్కోసారి మార్కెట్ మాయలో పడిపోతాం. షాపింగ్‌కు వెళ్తే.. చూడగానే కొనాలని అనిపించేవి కొన్ని ఉంటాయి. ఆఫర్ల పేరుతో ఊరిస్తూ కొన్ని కనిపిస్తాయి. ఇలాంటి మాయలో పడకూడదు. ఇందుకోసం ఏం చేయాలంటే.. మార్కెట్ కు వెళ్తున్నప్పుడే.. ఏం కొనాలో రాసిపెట్టుకొని వెళ్లాలి. వాటిని మించి ఒక్కటి కూడా కొనకూడదనే రూల్ మీకు మీరే పెట్టుకోవాలి. ఇలా చేస్తూ పోతే.. కొన్ని రోజులకు అలవాటవుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది.. ఆ వస్తువు నిజంగా అవసరమా? లేదా? అన్నది. సో.. ఇక నుంచి ఇలా చేయండి.. డబ్బు ఎందుకు మిగలదో చూడండి.
Tips For Choosing A Credit Card : సరైన క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవాలా?.. ఈ టిప్స్ పాటించండి!
అప్పు లేకుండా పిల్లల పెళ్లి చేయాలా? - ఈ సూపర్ ఫైనాన్షియల్ టిప్స్ మీకోసమే!
Gold Loan Vs Personal Loan : గోల్డ్ లోన్ Vs పర్సనల్ లోన్.. ఏది బెస్ట్ ఆప్షన్!