Bank Strike In December 2023 : ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) డిసెంబర్ నెలలో.. 6 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారని ప్రకటించింది. బ్యాంకుల అవసరాలకు తగినంత మంది ఉద్యోగుల నియమాకం కోసం ఈ స్ట్రైక్ చేపడుతున్నట్లు పేర్కొంది. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు బదులుగా.. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేస్తున్నట్లు వెల్లడించింది.
ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిందే!
AIBEA ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) సీహెచ్ వెంకటాచలం.. 2019 నుంచి 2023 మధ్య కాలంలో బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ చాలా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బ్యాంకింగ్ అవసరాలకు సరిపడా ఉద్యోగుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలు అన్నీ తెలుపుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
-
#BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/jQUTd6qcTz
— CH VENKATACHALAM (@ChVenkatachalam) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/jQUTd6qcTz
— CH VENKATACHALAM (@ChVenkatachalam) November 22, 2023#BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/jQUTd6qcTz
— CH VENKATACHALAM (@ChVenkatachalam) November 22, 2023
-
#BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/q5Gh1qqRHm
— CH VENKATACHALAM (@ChVenkatachalam) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/q5Gh1qqRHm
— CH VENKATACHALAM (@ChVenkatachalam) November 22, 2023#BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/q5Gh1qqRHm
— CH VENKATACHALAM (@ChVenkatachalam) November 22, 2023
బ్యాంక్ స్ట్రైక్ ఎప్పుడంటే?
Nationwide Bank Strike In December : ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రకారం..
- డిసెంబర్ 4 : ఈ రోజున దేశవ్యాప్తంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
- డిసెంబర్ 5 : ఈ రోజున దేశవ్యాప్తంగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు.
- డిసెంబర్ 6 : ఈ రోజు దేశవ్యాప్తంగా కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల స్ట్రైక్ ఉంటుంది.
- డిసెంబర్ 7 : యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు.
- డిసెంబర్ 8 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేస్తారు.
- డిసెంబర్ 9 : దేశంలోని అన్ని ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు.. ఆల్ ఇండియా లెవెల్లో బ్యాంక్ స్ట్రైక్ చేయనున్నారు.
డిసెంబర్లోని బ్యాంక్ సెలవులు
Bank Holidays In December 2023 : డిసెంబర్ నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉంది. పైగా ఈ 6 రోజుల స్ట్రైక్ నడవనుంది. కనుక దాదాపుగా 20 రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అందుకే బ్యాంక్ కస్టమర్లు తమ షెడ్యూల్ను పక్కగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఆర్థిక లావాదేవీలకు ఇబ్బందులు తప్పవు.
సెలవు దినాలు సహా, సమ్మె సమయంలో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : డిసెంబర్ నెలలో బ్యాంకు సెలవులు, సమ్మె ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే.. సులువుగా మీ ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.
డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!
ఈ 5 అలవాట్లు మిమ్మల్ని అప్పులపాలు చేస్తాయి - వెంటనే వాటిని మానుకోండిలా!