ETV Bharat / business

లాకర్​లో విలువైన వస్తువులు పోతే బ్యాంకులు బాధ్యత వహించవని తెలుసా? - బ్యాంక్​ లాకర్ల గురించి తెలుసుకొండి

Bank Locker Rules And Regulations : చాలా మంది బ్యాంక్​ లాకర్లలో తమ విలువైన పత్రాలు, బంగారం, అభరణాలను భద్రపరుచుకుంటూ ఉంటారు. ఒకవేళ వీటిలోని వస్తువులు పోతే, బ్యాంకులు పరిహారం అందిస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ అందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..

Bank Locker Rules And Regulations
Bank Locker Rules And Regulations
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 4:09 PM IST

Bank Locker Rules And Regulations : మన దేశంలో లక్షలాది మంది ప్రజలు తమ విలువైన పత్రాలు, బంగారం, వెండిని బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు. మరి వీటికి బ్యాంకులు బాధ్యత వహిస్తాయా? లాకర్​లో ఉన్న వస్తువులు పోతే.. బ్యాంకులు పరిహారం అందిస్తాయా? ఈ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది తమకు చెందిన ముఖ్యమైన పత్రాలను, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో దాచుకుంటారు. మనం బ్యాంక్ లాకర్​లో దాచుకునే వస్తువులు పోతే.. లేక వాటికి నష్టం వాటిల్లితే సదరు బ్యాంకే బాధ్యత వహిస్తుందని అనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు. వరదలు, భూకంపాలు, అల్లర్లు, ఉగ్రదాడులు జరిగిన సందర్భాల్లో మనం లాకర్లో ఉంచిన వాటికి బ్యాంకు బాధ్యత వహించదని రిజర్వ్​ బ్యాంక్​ రూల్స్ నిర్దేశిస్తున్నాయి.

వాటికి.. బ్యాంకులు బాధ్యత వహించవు!
వాస్తవానికి మనం బ్యాంకు లాకర్లలో దాచుకున్న వస్తువులకు బ్యాంకులు బాధ్యత వహించవు. కానీ అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, బ్యాంకు భవనం శిథిలమవ్వడం లేదా బ్యాంకు ఉద్యోగుల మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినప్పుడు.. మీరు లాకర్​ కోసం కట్టిన వార్షిక అద్దెపై మాత్రమే 100 రెట్లు పరిహారం అందిస్తుంది. అంతే తప్ప లాకర్​లో ఉన్న వస్తువులకు పరిహారం అందించదు.

ఉదాహరణకు వార్షిక లాకర్​ ఛార్జీ రూ.1000 అనుకుంటే.. బ్యాంకులు దానిపై 100 రెట్లు పరిహారం అందిస్తాయి. అంతేతప్ప మీరు లాకర్​లో ఉంచిన వస్తువులకు పరిహారం అందించదు.

"బ్యాంకులు.. మీరు లాకర్​లో ఉంచిన వస్తువుల భద్రత పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు కారణంగా మనం లాకర్​లో ఉంచిన వస్తువులకు నష్టం జరిగితే ఆ బ్యాంకులు ఎటువంటి బాధ్యత వహించవు. అగ్నిప్రమాదం, దోపిడి, భవనం శిథిలం అయ్యేటువంటి సందర్భాల్లో .. లాకర్​ వార్షిక అద్దెకు వంద రెట్లకు సమానమైన మొత్తాన్ని మాత్రమే పరిహారంగా అందిస్తుంది."

అదిల్ శెట్టి, బ్యాంక్​ బజార్ సీఈఓ

బహిర్గతం చేయనక్కర్లేదు
కస్టమర్​లు తమ​ లాకర్​లో ఏం దాచారో.. బ్యాంకు అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా లాకర్​ లోపల ఏముందో బ్యాంకులకు తెలిసే అవకాశం ఉండదు. కనుక జరిగిన నష్టానికి.. పరిహారం లెక్కించడం సాధ్యం కాదు. నిబంధనల ప్రకారం, లాకర్​లోని వస్తవులకు బ్యాంకులు బాధ్యత వహించవు. లాకర్​పై పూర్తి బాధ్యత లీజు తీసుకున్న వ్యక్తికే మాత్రమే ఉంటుంది.

బ్యాంకు లాకర్లలో నగదు ఉంచుకోవచ్చా?
Is It Legal To Keep Cash In Bank Locker : చాలా మందికి ఇదే సందేహం వస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా నూతన నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం కస్టమర్లు వారి డాక్యుమెంట్లు, అభరణాలు డిపాజిట్ లాంటి చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం మాత్రమే బ్యాంక్ లాకర్లు వాడాలని స్పష్టం చేసింది. వినియోగదారులు ఏ విధమైన నగదును లాకర్లలో ఉంచరాదని నిబంధనలు రూపొందించింది. అందువల్ల నగదును లాకర్​లో ఉంచకపోవడమే మంచిది. ఒక వేళ నోట్లు పాడైతే మీకు బ్యాంక్ నుంచి పరిహారం లభించదు.

'బ్యాంక్​ లాకర్లో నగదును ఉంచే కంటే మీ అకౌంట్​లో డిపాజిట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్ముకు వడ్డీ లభిస్తుంది. పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా.. మీ ఏ మాత్రం నష్టంరాదు. అలా కాకుండా లాకర్లలో ఉంచితే ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే లాకర్​లో దాచిన సొమ్ము ఎలా మీకు వచ్చిందే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది' అని బ్యాంక్​ బజార్​ సీఈఓ అదిల్​ శెట్టి వెల్లడించారు.

లాకర్లలో ఉంచకూడని వస్తువులు
రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, కొన్ని రకాల వస్తువులు బ్యాంకు లాకర్లలో ఉంచకూడదు. అవి:

  • ఆయుధాలు
  • మాదక ద్రవ్యాలు
  • నిషిద్ధ వస్తువులు
  • వేగంగా పాడైపోయే వస్తువులు
  • రేడియోధార్మిక పదార్థాలు

లాకర్లలో అభరణాలు, డాక్యుమెంట్లు లాంటి వస్తువులను మాత్రమే భద్రపరుచుకోవచ్చు. మీరు బ్యాంకులో లాకర్​ తీసుకుంటున్నప్పుడే వారి బాండుపై సంతకం చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ నిబంధనల ప్రకారం లాకర్​కు కొంత సొమ్ము చెల్లించాలి. రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం మీ లాకర్​ను వేరే వారికి ట్రాన్స్​ఫర్ చేయడం కుదరదు. అందుకే బ్యాంక్​ లాకర్ తీసుకోవాలని అనుకునే వారు.. ముందుగానే అన్ని నిబంధనలను కచ్చితంగా తెలుసుకోవడం మంచిది.

SBI Locker Charges : ఎస్​బీఐ లాకర్ కొత్త​ రూల్స్, ఛార్జీలు తెలుసా? బ్యాంక్​కు వెళ్లి సైన్ చేయడం మస్ట్!

Bank Locker New Rules : లాకర్ల గురించి ఈ 5 రూల్స్​ తప్పక తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.