Bank Holidays in May 2022: ఆర్థిక లావాదేవీల కోసం మేలో బ్యాంక్‌కు వెళ్లాలా? అయితే ఈ సమాచారం మీ కోసమే! దేశవ్యాప్తంగా వివిధ పండగలు, సాధారణ సెలవులు కలిపి మేలో మొత్తం 11 సెలవు దినాలను ఆర్‌బీఐ గుర్తించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది. వీటిని గమనించి వినియోగదారులు తమ బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రాంతాల వారీగా బ్యాంకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.
- మే 1: ఆదివారం
- మే 2: రంజాన్
- మే 3: అక్షయ తృతీయ, భగవాన్ శ్రీ పరశురామ జయంతి
- మే 8: ఆదివారం
- మే 9: రబీంద్రనాథ్ ఠాగూర్ జయంతి(కోల్‌కతా)
- మే 14: రెండో శనివారం
- మే 15: ఆదివారం
- మే 19: బుద్ధ పూర్ణిమ (కోల్‌కతా, ముంబయి, లఖ్‌నవూ, శ్రీనగర్, భోపాల్, అగర్తలా)
- మే 22: ఆదివారం
- మే 28: నాలుగో శనివారం
- మే 29: ఆదివారం
మూడు కేటగిరీల కింద బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవులు ఇస్తుంది. హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే, బ్యాంకుల అకౌంట్స్ క్లోజింగ్ కింద సెలవులు మంజూరు చేస్తుంది.
ఇదీ చదవండి: 'మా భవిష్యత్ ఏంటి?'.. ట్విట్టర్ సీఈఓకు చుక్కలు చూపిస్తున్న ఉద్యోగులు!