ADAS To Get Mandatory In All New Cars In India : భారతదేశంలో నేడు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వాహనాల్లో 'అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్' (ADAS)ను తప్పనిసరి చేయాలని ఆలోచిస్తోంది. దీని ద్వారా రోడ్డు భద్రతను పెంపొందించడానికి, రోడ్డు ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించడానికి వీలవుతుందని భావిస్తోంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే కొన్ని నిర్ధిష్ట ఫోర్-వీలర్ వాహనాల్లో 'మూవింగ్ ఆఫ్ ఆన్ఫర్మేషన్ సిస్టమ్' (MOIS)ను ఇన్స్టాల్ చేయాలని ప్రతిపాదించింది. పాసింజర్, వాణిజ్య వాహనాలు రెండింటిలోనూ ఈ MOISను ఇన్స్టాల్ చేయాలని స్పష్టం చేస్తోంది.
ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం!
సాధారణంగా అతివేగంగా వచ్చే వాహనాల వల్ల పాదచారులు, సైక్లిస్టులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు. దీనిని నివారించేందుకే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ.. వాహనాల్లో MOISను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని ప్రతిపాదిస్తోంది.
వాస్తవానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఇప్పటికే దీనికోసం ఒక ముసాయిదాను తయారు చేసింది. దీని ప్రకారం, MOIS అనేది వాహనం సమీపంలోని పాదచారులు, సైక్లిస్ట్ల ఉనికిని డ్రైవర్‌కు తెలియజేస్తుంది. దీనితో డ్రైవర్ వేగం తగ్గించి, వాహనాన్ని నడపడానికి వీలవుతుంది. ఫలితంగా ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆ కేటగిరీ వాహనాల్లో తప్పనిసరి!
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంతిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా.. ఆటోమోటివ్ పరిశ్రమ ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ముఖ్యంగా M2, M3, N2, N3 వాహనాల్లో MOIS వ్యవస్థ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది.
సంప్రదాయ భద్రత మార్గాలు!
పాదచారులు, సైక్లిస్ట్‌లు లాంటి వల్నరబుల్ రోడ్ యూజర్స్ (VRU) భద్రత కోసం.. సంప్రదాయంగా వాహనాల్లో పలు అద్దాలు ఏర్పాటుచేస్తారు. వీటిని వల్ల డ్రైవర్ తమ వాహనం వెనుక వస్తున్న వాహనాలను గుర్తించగలుగుతాడు. అయితే ప్రస్తుత కాలంలో వాహనాల రద్దీ పెరగడం సహా అతివేగం వల్ల.. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహన ప్రమాదాలను నివారించేందుకు అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)ను వాహనాల్లో అమర్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీని వల్ల భారీ స్థాయిలో వాహన ప్రమాదాలు నివారించడానికి వీలవుతుందని భావిస్తోంది.
MOIS ఎలా పనిచేస్తుందంటే?
డ్రైవర్ వాహనం నడుపుతున్నప్పుడు.. ఎవరైనా పాదచారులు లేదా సైక్లిస్టులు.. బండి ముందు ఉన్న క్రిటికల్ బ్లైండ్ స్పాట్ ఏరియాలోకి ప్రవేశించారని అనుకుందాం. అప్పుడు MOIS వెంటనే ప్రమాద హెచ్చరిక చేస్తుంది. దీనితో డ్రైవర్ అప్రమత్తమై, వాహనం వేగం తగ్గించడం గానీ, లేదా వాహనాన్ని పూర్తిగా నిలిపివేయడం గానీ చేస్తాడు. దీనితో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు బాగా తగ్గిపోతాయి.
భారీగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు!
Road Accident Data In India 2022 : భారతదేశంలోని నేడు హిట్ ఫ్రమ్ బ్యాక్, హిట్ అండ్ రన్, హెడ్ ఆన్ కొలిషన్ ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2022లో దేశంలో రోడ్డు ప్రమాదాలు 12 శాతం వరకు పెరిగాయి. ప్రతి గంటకు 4.6 లక్షలకుపైగా ప్రమాదాలు, 19 మరణాలు సంభవిస్తున్నాయి. అయితే 2024 నాటికి మీ రోడ్డు ప్రమాదాలను, మరణాల సంఖ్యను సగానికి పైగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయా?
భారతదేశంలో ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు ADASను ప్రవేశపెట్టాయి. అయితే ఇది ఇప్పటి వరకు తప్పనిసరికాదు. కానీ ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేసిందంటే.. అప్పటి నుంచి అన్ని వెహికల్ వేరియంట్లతో, మోడల్స్‌లోనూ కచ్చితంగా లెవల్ 1 ADAS వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీనితో కార్ల ధరలు కాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
2024లో లాంఛ్ కానున్న టాప్-7 కార్స్ ఇవే! లుక్స్, మైలేజ్, ఫీచర్స్ వివరాలు ఇలా!