ETV Bharat / business

మూడు నెలల్లో 50వేల ఐటీ జాబ్స్​, ఐదేళ్లలో మరో 60లక్షలు - software jobs for freshers 2022

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామక లక్ష్యాలను తగ్గించే యోచనలో కంపెనీలు లేనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు ఉన్నప్పటికీ.. అమెరికా, ఐరోపాల్లో గిరాకీ బాగుండటం ఇందుకు కలిసొస్తుంది. ఫలితంగా భారీ స్థాయిలో టెక్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

Tech jobs in India
మూడు నెలల్లో 50వేల ఐటీ జాబ్స్​, ఐదేళ్లలో మరో 60లక్షలు
author img

By

Published : Aug 29, 2022, 9:06 AM IST

Tech jobs in India : రాబోయే అయిదేళ్లలో దేశీయంగా 60 లక్షల టెక్‌ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని సృష్టించే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈఓ సునీల్‌ అన్నారు. గిరాకీ పెరుగుతున్నందున టెక్‌ నిపుణుల వలసలు అధికమవుతున్నాయని.. వీరిని అట్టేపెట్టుకునేందుకు కంపెనీలకు అధిక వ్యయాలు అవుతున్నాయని తెలిపారు. ఒకే నిపుణుడు ఒకటికి మించి చేస్తున్న ఉద్యోగాల (మూన్‌లైటింగ్‌) వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. జూన్‌ మొదటి త్రైమాసికంలో అగ్రగామి భారత ఐటీ కంపెనీలైన టీసీఎస్‌ (14,136), ఇన్ఫోసిస్‌ (21,171), విప్రో (15,446) నికర నియామకాలు 50,000 మార్కును అధిగమించాయని తెలిపారు. గిరాకీని అందుకునేందుకు ఐటీ కంపెనీలు నియామకాలు జరుపుతుంటే, డిజిటలీకరణకు మారుతున్న వినియోగదారుల అవసరాలు తీర్చడంపై నాన్‌-టెక్‌ కంపెనీలు దృష్టిపెడుతున్నాయని తెలిపారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామక లక్ష్యాలను తగ్గించే యోచనలో కంపెనీలు లేనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు ఉన్నప్పటికీ.. అమెరికా, ఐరోపాల్లో గిరాకీ బాగుండటం ఇందుకు కలిసొస్తుంది.
* మార్జిన్‌లపై ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇటీవల విప్రో, ఇన్ఫోసిస్‌లు ఉద్యోగుల వేరియబుల్‌ పేల్లో కోత విధించాయి. అంతర్జాతీయ వ్యాపార జోరు నెమ్మదిస్తే.. పరిశ్రమకు మరింత ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాల పునరుద్ధరణకు కంపెనీలు మంచి రేటును అడిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, ఖర్చులు పెరగడంతో ఇది సులభమేనని చెబుతున్నారు.

* జూన్‌ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ 21,171 మంది నిపుణులను నియమించుకుంది. మార్చితో పోలిస్తే వలసలు 27.7 శాతం నుంచి 28.4 శాతానికి పెరిగాయి. ఏడాది క్రితం ఇవి 13.9 శాతం మాత్రమే. అధిక ఉద్యోగుల ప్రయోజన వ్యయాలు, సబ్‌ కాంట్రాక్టుల ఖర్చులు, ప్రయాణ భత్యాల వల్ల మొత్తం వ్యయాలు అధికమయ్యాయి. వేతన పెంపులతో మార్జిన్‌లపై 160 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం పడింది. వ్యయ నియంత్రణ చర్యలు కొనసాగిస్తామని మాత్రం ఇన్ఫోసిస్‌ తెలిపింది. మొదటి త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్‌ దాదాపు 20 శాతంగా ఉండగా, మిగతా ఏడాదిలో 21-23 శాతం ఉండొచ్చని అంచనా వేస్తోంది.

* జూన్‌ త్రైమాసికంలో విప్రో నిపుణుల నియామకాలు 15,446గా నమోదైంది. ఉద్యోగుల వలసల రేటు 23.8 శాతం నుంచి 23.3 శాతానికి చేరింది. టెక్‌ పరిశ్రమలో మూన్‌లైటింగ్‌ (ఉద్యోగంలో ఉంటూ వేరే సంస్థకు పనిచేయడం) వంటి అంశాలు కలవరపెడుతున్నాయి. ఇది మోసమని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఇటీవల అభిప్రాయపడ్డారు.
* టీసీఎస్‌ కొత్తగా 14,136 మంది నిపుణులను చేర్చుకుంది. వలసల రేటు 17.4 శాతం నుంచి 19.7 శాతానికి చేరింది. గతేడాది జూన్‌ త్రైమాసికంలో ఈ రేటు 8.6 శాతంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.