వరుసగా రెండోరోజు లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రస్తుతం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేతపై ఆయా దేశాల్లో నెలకొన్న అనిశ్చితితో అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలివ్వడం.. దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 30, 641 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 14 పాయింట్ల వృద్ధితో 9,043 వద్ద ఉంది.
లాభనష్టాల్లో..
30 షేర్ల సూచీ సెన్సెక్స్‌లో కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, టాటా స్టీల్, బజాజ్ ఆటో సహా 13 సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు..
షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ముడిచమురు..
బ్యారెల్ ముడిచమురు ధర 0.17 శాతం తగ్గి 36.11 గా ఉంది.
ఇదీ చూడండి: 'స్వాతంత్య్రం తర్వాత ఇదే దారుణమైన మాంద్యం'