Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 89 పాయింట్లు కోల్పోయి 57 వేల 596 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ పాయింట్లు 23 పాయింట్లు తగ్గి.. 17 వేల 223 వద్ద సెషన్‌ను ముగించింది. నేటి సెషన్లో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. లోహం, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి.
- సెన్సెక్స్ తొలుత దాదాపు 500 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. 57 వేల 139 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
- అనంతరం కాస్త కోలుకున్నా.. తీవ్ర ఒత్తిడిలో ట్రేడింగ్ సాగించింది.
- మళ్లీ 130 పాయింట్లకుపైగా పెరిగి 57 వేల 828 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదుచేసింది.
దూసుకెళ్లిన పేటీఎం: బీఎస్ఈ 30 క్యాప్ ఇండెక్స్‌లో సగం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి సెషన్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రాణించాయి. కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ పడిపోయాయి. లిస్టింగ్ అయినప్పటి నుంచి భారీగా పతనమవుతూ వస్తున్న పేటీఎం షేరు.. గురువారం సెషన్లో ఒక్కసారిగా పుంజుకుంది. 9 శాతం పెరిగి 571.40 వద్ద ముగిసింది. ఓ దశలో ఏకంగా 12 శాతానికిపైగా పెరిగింది. 521 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని నమోదుచేసిన షేరు.. అనంతరం ఒక్కసారిగా దూసుకెళ్లింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు ఏకంగా 17 శాతం పెరగడం విశేషం. ఓ దశలో 20 శాతానికిపైగా పెరిగి 307.25 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. చివరకు 299 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి: ఐఓబీ, సీబీఐ ప్రైవేటీకరణ? ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్!