ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి.. వరుసగా ఆరో సెషన్​లో మార్కెట్లు డౌన్​ - russia ukraine news

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ ఉద్రిక్త పరిస్థితులు స్టాక్​ మార్కెట్లను తీవ్ర ఒడుదొడుకులకు గురిచేస్తున్నాయి. దేశీయ సూచీలు రోజంతా మంచి లాభాల్లోనే ఉన్నా.. ఆఖర్లో మళ్లీ నేలచూపులు చూశాయి. సెన్సెక్స్​ 69, నిఫ్టీ 29 పాయింట్లు పడిపోయాయి.

Stock Market Close
Stock Market Close
author img

By

Published : Feb 23, 2022, 3:46 PM IST

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో సెషన్​లో నష్టాల్లోనే ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 69 పాయింట్లు తగ్గి.. 57 వేల 232 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్​ తొలుత 300 పాయింట్లకుపైగా లాభంతో సెషన్​ను ప్రారంభించింది. రోజంతా లాభాల్లోనే ఉన్నా.. మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 430 పాయింట్ల లాభంతో 57 వేల 733 వద్ద సెషన్​ గరిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ 190 పాయింట్ల నష్టంతో 57 వేల 109 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 17 వేల 63 వద్ద సెషన్​ను ముగించింది.

రియాల్టీ ఇండెక్స్​ 3 శాతం మేర పుంజుకుంది. ఆటో, ఐటీ రంగం షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై.. చాలా వరకు నష్టాలు నమోదుచేశాయి.

Russia Ukaraine Crisis: రష్యా- ఉక్రెయిన్​ వివాదం.. మార్కెట్ల వరుస నష్టాలకు కారణమవుతోంది.

లాభనష్టాల్లో ఇవే..

కోటక్​ మహీంద్రా, టైటాన్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, మారుతీ సుజుకీ లాభపడ్డాయి.

ఓఎన్​జీసీ, హీరో మోటోకార్ప్​, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే భారీగా జంప్

చమురుకు రెక్కలు.. త్వరలో పెట్రోల్ రేట్ల మోత.. బండి తీయలేమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.