స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర సోమవారం కూడా కొనసాగింది. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 167 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 58,297 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 54 పాయింట్ల లాభంతో తొలిసారి 17,378 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ సానుకూలతలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ షేర్లు కూడా భారీ లాభాలను గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,515 పాయింట్ల అత్యధిక స్థాయి (నూతన రికార్డు), 58,200 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,429 పాయింట్ల గరిష్ఠ స్థాయి (జీవనకాల గరిష్ఠం), 17,345 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు లాభాలను గడించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్) భారీగా, కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు సోమవారం లాభాలను గడించాయి.
ఇదీ చదవండి: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ముకేశ్ అంబానీ!