పెట్రో మోతతో(Petrol Diesel Price) అల్లాడిపోతున్న సామాన్యుడికి మరోసారి ధరల భారం తప్పేలా లేదు! అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగనున్న నేపథ్యంలో.. భారత్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు(Petrol Diesel Price) భారీగా పెరగనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే.. చమురు సంస్థలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుండటం వల్ల ధరల పెంపు తప్పదని తెలుస్తోంది.
గత 12 రోజులుగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ ధరలు పెరుగునున్న నేపథ్యంలో ఈ ధరల్లో మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. ఆగస్టు నెలతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ నెలలో బ్యారెల్కు 4 నుంచి 6 డాలర్ల వరకు పెరిగాయి. అయితే.. ఇప్పటివరకైతే చమురు సంస్థలపై ఈ ప్రభావం పడకపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా పెట్రో ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు... రిటైల్ పెట్రోల్, ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు జులై 17, జులై 15న చివరిసారిగా పెరిగాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ దర రూ.101.19గా కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.88.62 పైసలు వద్ద ఉంది.
ఇదీ చూడండి: ఏసీలు, ఎల్ఈడీల ఉత్పత్తి.. ఇక పూర్తిగా దేశీయంగానే!
ఇదీ చూడండి: 'ఓలా ఎలక్ట్రిక్' రికార్డ్- 2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు