GOLD PRICE TODAY: దేశ రాజధానిలో బంగారం ధర భారీగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.1,202 మేర ఎగబాకి.. రూ.51,889కి చేరుకుంది. క్రితం సెషన్లో బంగారం ధర రూ.50,687గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో దేశంలో పసిడి ప్రియమైందని విశ్లేషకులు తెలిపారు.
Gold price in Delhi
బంగారంతో పాటు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండి రూ.2,148 అధికమై.. రూ.67,956కు చేరుకుంది.
Gold rate in Hyderabad
మరోవైపు, హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ. 53,250 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.69,190గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర..
అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1943 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 25.18 డాలర్ల వద్ద కదలాడుతోంది.
రూపాయి పతనం..
బుధవారం ప్రారంభ సెషన్లో రూపాయి విలువ 49 పైసలు పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.82గా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపాయి పతనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి: వార్ ఎఫెక్ట్.. మార్కెట్లు ఢమాల్.. సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్