ETV Bharat / business

SBI loan: ఎస్​బీఐ బంపర్​ ఆఫర్​- లోన్లపై భారీగా వడ్డీ తగ్గింపు! - ఎస్​బీఐ పండుగ బొనాంజ

దేశీయ అతిపెద్ద బ్యాంక్​ ఎస్​బీఐ పండుగ బొనాంజా (SBI Festive offers) ఆఫర్లు ప్రకటించింది. హోం లోన్స్​పై వడ్డీ (SBI loan) రేట్లను 45 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు తెలిపింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా వడ్డీ తగ్గింపు వర్తించనున్నట్లు పేర్కొంది.

SBI Festive offers
ఎస్​బీఐ పండుగ ఆఫర్లు
author img

By

Published : Sep 16, 2021, 5:14 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ.. వినియోగదారులకు పండుగ ఆఫర్లు (SBI Festive offers) ప్రకటించింది. క్రెడిట్​ స్కోర్​ అనుసంధానిత హోం లోన్స్ (SBI loan) వడ్డీ రేటును 45 బేసిస్​ పాయింట్లు తగ్గించింది.

ఇప్పటి వరకు రూ.75 లక్షల వరకు హోం లోన్​పై వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంది. ఇకపై రుణం (SBI loan) మొత్తంతో సంబంధం లేకుండా.. వడ్డీ రేటు 6.70గా ఉంటుందని ఎస్​బీఐ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల 30 ఏళ్ల కాల పరిమితితో.. రూ.75 లక్షల రుణం తీసుకుంటే రూ.8 లక్షల వరకు వడ్డీ భారం తగ్గనుంది.

ఇంతకు ముందు ఉద్యోగులతో పోలిస్తే.. ఉద్యోగేతరులకు వడ్డీ రేటు 15 బేసిస్​ పాయింట్లు ఎక్కువగా ఉండేదని ఎస్​బీఐ తెలిపింది. తాజాగా ఈ అంతరాన్ని తొలగిస్తున్నట్లు వివరించింది.

ఇది వరకే హోం లోన్స్​పై (SBI home loan) ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు కూడా ఎస్​బీఐ గుర్తు చేసింది.

ఇదీ చదవండి: కేంద్రం నిర్ణయంపై టెలికాం సంస్థల హర్షం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.