భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటనలు చేసింది. రివర్స్ రెపోరేటు తగ్గింపు తగ్గింపు, సూక్ష్మ ఆర్థిక సంస్థలు, నాబార్డు, జాతీయ హౌసింగ్ బోర్డ్‌కు భారీ సాయం ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఆర్‌బీఐ గవర్నర్ ప్రెస్‌మీట్ హైలైట్స్:
రూ.50 వేల కోట్లతో ఎల్టీఆర్ఓ 2.0
- కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్టీఆర్ఓ 2.0.
- ఆర్‌బీఐ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు విడుదల. నాబార్డ్, సిడ్బీ, ఎన్హెజ్బీ వంటి ఆర్థిక సంస్థలకు రుణాల రూపంలో అందజేత.
- రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 4శాతం నుంచి 3.75శాతానికి చేరిన ఆర్ఆర్ఆర్.
- రెపో రేటు యథాతథం.
శక్తికాంత దాస్ భరోసా
- కరోనా సంక్షోభంతో ఏర్పడ్డ పరిస్థితుల్ని రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.
- కరోనా సంక్షోభం ఉన్నా సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చొరవ చూపాలి.
- భారత్ 1.9 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా. మొత్తం జీ20 దేశాల్లో ఇదే అత్యధికం కావడం సంతృప్తికర అంశం.
- 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఐఎంఎఫ్ అంచనాల బట్టి ఈ విషయం అర్థమవుతోంది. 7.4శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం.
- మార్చిలో వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. విద్యుత్ డిమాండ్ భారీగా క్షీణించింది.
- 2008-09 ఆర్థిక మాంద్యాన్ని మించిన స్థాయిలో మార్చిలో ఎగుమతులు 34.6శాతం మేర తగ్గాయి.
- లాక్డౌన్ వేళ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ డౌన్‌టైమ్ లేదు. బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి.
- ద్రవ్య లభ్యత సరిపడా ఉండేలా చూసేందుకు, రుణ మంజూరు సజావుగా సాగేందుకు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు త్వరలో చర్యలు.