ETV Bharat / business

హోం లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయ్యిందా?

సొంతింటి కల నెరవేర్చుకునేందుకు చాలా మంది రుణం వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే హోం లోన్ పొందటం అంత తేలికైన విషయమేమీ కాదు. కొన్నిసార్లు బ్యాంక్​లు రుణం మంజూరు చేయకపోవచ్చు. ఇందుకు దరఖాస్తులో చేసే తప్పులు సహా అనేక ఇతర కారణాలు ఉన్నాయి. మరి హోం లోన్​ దరఖాస్తు తిరస్కరణకు కారణాలు ఏమిటి? అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి విషయాలను పరిశీలిస్తాయి? అనే పూర్తి వివరాలు మీ కోసం.

Reasons to reject a home loan application
గృహ రుణ దరఖాస్తు విషయంలో జాగ్రత్తలు
author img

By

Published : Jul 15, 2021, 1:36 PM IST

రుణం ఆమోదించేందుకు రుణ‌దాత‌లు ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను చూస్తారు. ఒక‌టి క్రెడిట్ స్కోరు(రుణ చరిత్ర), రెండు ఆదాయం. రుణాలు మంజూరు చేసేందుకు ప్ర‌తి బ్యాంకుకు కొన్ని నియ‌మనిబంధ‌న‌లు ఉంటాయి. బ్యాంకులు కావ‌ల‌సిన‌ క‌నీస అర్హ‌త‌లు ఉన్న వారికే రుణాన్ని ఆమోదిస్తాయి. లేదంటే ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తాయి.

రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వ్య‌క్తికి స్థిర‌మైన ఆదాయం ఉందా.. అనే అంశాన్ని ముందుగా ప‌రిశీలిస్తాయి బ్యాంకులు. దీంతో పాటు వ్య‌క్తి వ‌య‌సు, నివాసం, విద్యార్హ‌త‌లు వంటి వాటినీ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు.

ద‌ర‌ఖాస్తులో త‌ప్పులు.. అంటే పేరు, వ‌య‌స్సు, చిరునామా వంటివి లోన్ అప్లికేష‌న్‌లో త‌ప్పుగా ఎంట‌ర్‌చేస్తే.. బ్యాంకులు, దర‌ఖాస్తుదారుని గురించి కావ‌ల‌సిన స‌మాచారాన్ని సేక‌రించ‌డం క‌ష్టం అవుతుంది. దీంతో ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంది.

రుణ దర‌ఖాస్తు తిర‌స్క‌రించ‌డానికి కార‌ణాలు..

వ‌య‌సు, స‌ర్వీసు ఉన్న కాలం, ఈఎంఐ..

రుణం తిరిగి చెల్లించే కాల‌వ్య‌వ‌ధి కూడా రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యిస్తుంది. మీరు వ‌య‌సులో చిన్న‌వారై ఉండి.. రుణం తిరిగి చెల్లింపుల‌కు ఎక్కువ కాల‌వ్య‌వ‌ధి ఉంటే.. త‌క్కువ ఈఎంఐతో రుణం తీర్చేందుకు అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి తొంద‌ర‌గా ఆమోదించే అవ‌కాశం ఉంది. అదే మీ వ‌య‌సులో పెద్ద వారై.. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న వారైతే రుణం తీర్చేందుకు త‌క్కువ కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. ఈఎంఐ పెరుగుతుంది. అంతేకాకుండా మీ ఆదాయంలో నిర్దిష్ట శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఈఎంఐ ఉండాల‌ని ప‌రిమితి విధిస్తాయి రుణ‌సంస్థ‌లు. సాధార‌ణంగా నెల‌వారీ ఆదాయంలో 50 శాతం లోప‌ల ఈఎంఐ ఉండాలి. అంత‌కు మించి ఈఎంఐ చెల్లించాల్సి వ‌స్తే రుణ‌ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంది.

ఆస్తి విలువ త‌క్కువుంటే..

బ్యాంకులు సాధారణంగా ఆస్తి విలువలో 85 శాతం వరకు రుణంగా అందిస్తాయి. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా.. భవ‌నం వ‌య‌స్సు, ఇల్లు ఉన్న ప్ర‌దేశం, నిర్మాణ విలువ‌లు, ప్ర‌స్తుతం ఉన్న స్థితి వంటి ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని ఆస్తి విలువ‌ను అంచ‌నా వేస్తాయి. ఆదాయం ఆధారంగా అధిక రుణం తీసుకునేందుకు మీకు అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఆస్తి విలువ త‌క్కువగా ఉంటే రుణ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించ‌వ‌చ్చు.

అనుమ‌తులు లేని ఆస్తి లేదా బిల్డ‌ర్‌..

ఆస్తి స్థానిక సంస్థల నుంచి ఆమోదం పొందిందో, లేదో రుణదాతలు తనిఖీ చేస్తారు. స్థానిక అధికారులు సూచించిన నిర్దిష్ట మార్గదర్శకాలకు కట్టుబడి ఉండకపోతే రుణాన్ని తిరస్కరించవచ్చు. అదేవిధంగా, బిల్డర్లకు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసే ముందు బ్యాంకుల వాటిని పూర్తిగా ప‌రిశీలిస్తాయి. మీరు బిల్డ‌ర్ వ‌ద్ద నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే.. బ్యాంకు ఆమోదం లేని లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బిల్డ‌ర్ వ‌ద్ద నుంచి ఇంటిని కొనుగోలు చేస్తున్న‌ప్పుడు.. ఆస్తి విలువ, ఆదాయం ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ కూడా ద‌ర‌ఖాస్తు రిజ‌క్ట్ అయ్యే అవ‌కాశం ఉంది.

ఆస్తి వ‌య‌సు

కొనుగోలు చేసిన ఇంటిని హామీగా పెట్టుకుని రుణం ఇస్తారు. ఒక‌వేళ ఆస్తి పాత‌ది అయితే, చ‌ట్ట‌ప‌ర‌మైన‌, సాంకేతిక అంశాల‌తో పాటు నిర్మాణ ప‌త‌న సంభావ్య‌త‌ను కూడా అంచనా వేస్తాయి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆస్తి పాత‌దైన‌ప్పుడు లేదా కూల్చివేత ద‌శ‌కు చేరుకున్న ఆస్తి కొనుగోలుకు చేసే రుణ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.