దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. అయితే కరోనా వల్ల ఇటీలవ చాలా మంది ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి. దీనితో పెరిగిన ఇంధన ధరలు వారికి భారంగా మారుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల పనితీరుపై రాజీ పడకుండా ఇంధన ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వినియోగదారులు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారిస్తున్నారు.
ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌కు ప్రధాన ప్రత్యామ్నాయాలైన.. ఎల్పీజీ, సీఎన్జీలను వినియోగించేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎల్పీజీతో ఎంత ఆదా?
వాహనదారులు అధికంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.80కి కాస్త అటూ ఇటుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎల్పీజీ మాత్రం వాటిలో సగం ధరకే లభిస్తోంది.
పెట్రల్ కంటే ఎల్పీజీ ధర 40 శాతం వరకు తక్కువగా ఉంది. ఫలితంగా వాహన వినియోగదారులకు ఇంధన ఖర్చు ఇది చాలా వరకు తగ్గిస్తుందని ఇండియన్ ఆటో ఎల్పీజీ సంఘం అంటోంది.
ఈ ప్రయోజనాల నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ నుంచి ఎల్పీజీకి వాహనాన్ని కన్వర్ట్ చేసే కిట్ల కోసం వినియోగదారుల నుంచి భారీగా వినతులు వస్తున్నట్లు ఇండియన్ ఆటో ఎల్పీజీ సంఘం చెబుతోంది.
ఇదీ చూడండి:ఐఓఎస్‌లోనూ గూగుల్ మ్యాప్స్- త్వరలో విడుదల