ప్రగతి రథ చక్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు.. కునారిల్లిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు.. కరోనా దెబ్బకు అలసిపోయిన ప్రధాన రంగాలకు పునరుజ్జీవం తెచ్చేందుకు... కేంద్రం పలు సంస్కరణలు చేపట్టాలని యోచిస్తోంది. ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 4వ రోజున ఈ వివరాలను వెల్లడించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.
బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తి, ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్, విమానయాన మెయింటెనెన్స్-రిపేర్-ఓవరాల్, విద్యుత్ పంపిణీ, రోదసి, అణు ఇంధన రంగాల్లో ఈ సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.