ETV Bharat / business

జైడస్​ కాడిలా 'కరోనా మందు' ధర ఎంతంటే? - COVID-19 drug Remdesivir

కరోనా బాధితుల చికిత్సలో అందించే రెమ్​డెసివిర్​ మందును భారత మార్కెట్లోకి విడుదల చేసినట్టు జైడస్​ కాడిలా సంస్థ ప్రకటించింది. దీని ధర 100 ఎమ్​జీలకు రూ.2,800 అని పేర్కొంది. దీనిని రెమ్​డక్​ పేరుతో అమ్ముతున్నట్టు స్పష్టం చేసింది.

Zydus Cadila launches COVID-19 drug Remdesivir in India
జైడస్​ కాడిలా నుంచి మార్కెట్​లోకి రెమ్​డెసివిర్​
author img

By

Published : Aug 13, 2020, 1:55 PM IST

Updated : Aug 13, 2020, 11:14 PM IST

కరోనా వైరస్​ బాధితులకు అందించే రెమ్​డెసివిర్​ మందును రెమ్​డక్​ పేరుతో భారత మార్కెట్లోకి విడుదల చేసినట్టు జైడస్ కాడిలా సంస్థ వెల్లడించింది. 100 ఎమ్​జీల సీసా ధర రూ.2,800 అని పేర్కొంది. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రులకు మందు అందే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు సంస్థ స్పష్టం చేసింది.

"కరోనా సంక్షోభం ఆద్యంతం.. ప్రజలకు మద్దతుగా నిలవడం కోసం కాడిలా సంస్థ కృషి చేసింది. అది వ్యాక్సిన్​ అభివృద్ధి చేయడంలోనైనా, అత్యవసర మందుల ఉత్పత్తి, పంపిణీ, పరీక్ష నిర్వహణ, కొత్త చికిత్స విషయంలోనైనా మా సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది."

--- డా. శర్విల్​ పటేల్​, కాడిలా మేనేజింగ్​ డైరక్టర్

రెమ్​డెసివిర్​ తయారీ, అమ్మకాలపై ఈ ఏడాది జూన్​లో గిలీడ్​ సైన్​సెస్​ ఐఎన్​సీతో ఒప్పందం కుదుర్చుకుంది జైడస్​ కాడిలా.

Last Updated : Aug 13, 2020, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.