ETV Bharat / business

నిరాశపరిచిన జొమాటో- 3 రెట్లు పెరిగిన క్యూ1 నష్టం! - 2021-22 క్యూ1లో జొమాటో ఆదాయం

స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తర్వాత తొలిసారి ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో జొమాటో నిరాశపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ నష్టం.. క్రితం ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగి.. రూ.356 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. ఆదాయం మాత్రం భారీగా పెరిగినట్లు వెల్లడించింది.

Huge lose to Zomato
జొమాటోకు భారీ నష్టం
author img

By

Published : Aug 11, 2021, 4:04 PM IST

ఫుడ్ డెలివరీ ప్లాట్​ఫామ్​ జొమాటో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. సంస్థ ఐపీఓకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ఇవే కావడం గమనార్హం.

2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​-జూన్​ మధ్య రూ.356 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్లు జొమాటో ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నష్టం రూ.99.8 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.

ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో సంస్థ ఆదాయం మాత్రం రికార్డు స్థాయిలో రూ.916 కోట్లకు పెరిగినట్లు తెలిపింది జొమాటో. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.283.5 కోట్లుగా వెల్లడించింది. ఏప్రిల్​లో కొవిడ్ రెండో దశ ప్రారంభమైనప్పటికీ.. ఫుడ్​ డెలివరీ సేవలకు పెరిగిన డిమాండ్ వల్ల ఈ స్థాయిలో ఆదాయం గడించినట్లు వివరించింది.

తమ డెలివరీ భాగస్వాములు వారానికి కనీసం 40 గంటలు పని చేస్తున్నారని జొమాటో తెలిపింది. వారంతా నెలకు సగటున రూ.27 వేల వరకు సంపాదిస్తున్నట్లు వివరించింది. జులై నాటికి కంపెనీ డెలివరీ భాగస్వాముల సంఖ్య 310,000గా ఉన్నట్లు పేర్కొంది.

మరిన్ని..

గత నెలలోనే ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకుని ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జొమాటో.. తొలి రోజే అదరగొట్టింది. అదే రోజు సంస్థ మార్కెట్ క్యాపిటల్​ రూ.1 లక్ష కోట్ల మార్క్​ను కూడా తాకింది.

ఫలితాల నేపథ్యంలో ఇటీవల భారీగా పతనమైన సంస్థ షేర్లు.. బుధవారం సెషన్​లో తిరిగి తేరుకున్నాయి. ప్రస్తుతం సంస్థ షేరు విలువ బీఎస్​ఈలో రూ.134.50 వద్ద ఉంది.

ఇది చదవండి: బిలియన్​ డాలర్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకు ఫార్మ్​ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.