ETV Bharat / business

సిరి: నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ ఉంటుందా? - ఎస్​బీఐ

మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారు. కానీ మీ దగ్గర ఆ మొబైల్​కు సరిపడ డబ్బు లేదు. అలాంటి వారిని లక్ష్యాంగా చేసుకుని ఈ కామర్స్ దిగ్గజాలు నో కాస్ట్ ఈఎంఐ పేరుతో ఆఫర్​ను అందిస్తున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ అంటే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకుంటారు చాలామంది. మరి అందులో నిజమెంతో తెలుసుకోండి.

నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ ఉంటుందా
author img

By

Published : Jul 26, 2019, 1:38 PM IST

Updated : Jul 26, 2019, 2:42 PM IST

మీకు కావాల్సిన మొబైల్​ ఫోన్​ను క్రెడిట్ కార్డు ద్వారా కొని ఆ మొత్తాన్ని నిర్ణీత సమయంలో ఈఎంఐ రూపంలో చెల్లించాలి అనేది ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతిలో కొనుగోలు చేసేవారికి ప్రత్యేక డిస్కౌంట్​ను కూడా అందిస్తారు ఈ-కామర్స్ సంస్థల రిటైలర్లు. ఈ పద్ధతిలో కొనుగోలు సరైనదేనా? ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పని చేస్తుంది?

నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ ఉండదా?

బ్యాంకులు అందించే సున్నా శాతం వడ్డీ పథకాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు 2013లో నిషేధించింది. అప్పటి నుంచి నో కాస్ట్ ఈఎంఐ పేరుతో కొత్త ఆఫర్​ను తెరపైకి తెచ్చాయి బ్యాంకులు. ఈ పద్ధతిలో వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదనే వాదన తప్పు. మీరు తీసుకున్న ఉత్పత్తిపై వచ్చిన తగ్గింపును వడ్డీ రూపంలో మీకు రుణ సదుపాయం కల్పించిన బ్యాంకులు పొందుతాయి. అదెలా అంటే మొదట చెప్పినట్లు బ్యాంకుల వడ్డీకి సరిపడా డిస్కౌంట్​ను వినియోగదారులకు అందిస్తారు రిటైలర్లు. ఈఎంఐలో మాత్రం మొబైల్​పై ఉన్న పూర్తి ధరనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణ

మీరు కొనాలనుకున్న ఫోన్ ధర రూ.30,000. దీనిపై రిటైలర్ ఆఫర్ రూ. 500. అప్పుడు మీకు ఫోన్ లభించే ధర రూ.29,500 అవుతుంది. ఈ ఫోన్​ ఈఎంఐని రూ.10,000 చొప్పున మూడు నెలల పాటు చెల్లించాలి. ఇందులో మీకు డిస్కౌంట్​గా లభించిన రూ.500ని బ్యాంకులు వడ్డీ రూపంలో పొందుతాయి. వీటితో పాటు బ్యాంకులకు అదనంగా పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

నో కాస్ట్ ఈఎంఐ ఎలా పని చేస్తుంది?

ఇందులో ముగ్గురు వాటాదారులు ఉంటారు. రిటైలర్, బ్యాంకు, వినియోగదారుడు. సాధారణంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందిస్తాయి. రిటైలర్స్ వేగంగా అమ్ముకోవాలనుకుంటున్న ఉత్పత్తులపై మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్​ను అందిస్తాయి. నో కాస్ట్ ఈఎంఐ విషయంలో, కస్టమర్ చెల్లించే వడ్డీకి సమానమైన తగ్గింపును ఇవ్వడానికి రిటైలర్ సుముఖంగా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ లేదా ఆయా వస్తువుల తయారీదారు కస్టమర్​కు రాయితీ వడ్డీని చెల్లిస్తారు.

నో కాస్ట్ ఈఎంఐని అందించే బ్యాంకు క్రెడిట్ కార్డు మీదగ్గర లేకపోతే, మీరు ఈ ఆఫర్​ను పొందలేరు. అప్పుడు మీరు ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి ఈఎంఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విపణిలో బజాజ్ ఫిన్సర్వ్ ఈ సేవలను అందిస్తోంది. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు కోసం కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాంటి ఉత్పత్తులకు నో కాస్ట్ ఈఎంఐ లభిస్తుంది?

మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్స్, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తులపై డిస్కౌంట్ ఉంటుంది. రిటైలర్లు ప్రత్యక్ష తగ్గింపును అందించాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అది ఉత్పత్తి రాయితీని తగ్గిస్తుంది.

కొన్ని సార్లు రాయితీల కన్నా ఈఎంఐ తక్కువ చూపుతూ రిటైలర్లు మార్కెటింగ్ జిమ్మిక్కుతో వినియోగాదారులకు వల వేస్తుంటాయి. ఈ విధానం ద్వారా పాత స్టాక్​ను తగ్గించుకోవాలని ఆయా కంపెనీలు భావిస్తుంటాయి. ఇలా మార్కెటింగ్ జిమ్మిక్కుల్లో చిక్కుకుంటే మీకు అవసరం లేని వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆఫర్లు ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనుగోలు చేయడం మంచిది.

నో కాస్ట్ ఈఎంఐని అందించే బ్యాంకులు ఇవే

ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఆర్బీఎల్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి ఈ - కామర్స్ సంస్థలకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్​ను అందిస్తాయి.

ఇదీ చూడండి: దేశంలో నల్లధనం ఎంతో తెలీదు: కేంద్రం

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 26 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0644: Australia Social Media No access Australia 4222236
Australia calls to end Facebook, Google dominance
AP-APTN-0636: Japan SKorea Trade No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4222235
Japan to downgrade SKo's preferred nation status
AP-APTN-0631: Internet Trump ASAP Rocky AP Clients Only 4222234
Trump tells Sweden to free A$AP Rocky
AP-APTN-0527: US Trump Altered Seal AP Clients Only 4222231
Altered presidential seal used at Trump speech
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 26, 2019, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.