వొడాఫోన్ ఐడియా(వి)కు అటు ఆర్థికంగా ఇటు యూజర్ బేస్ పరంగా ఇబ్బందులు (Vodafone Idea crisis) తప్పడం లేదు. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' (TRAI data on User base) వెల్లడించిన తాజా డేటా ప్రకారకం.. 'వి' జూన్లో 42.89 లక్షల యూజర్లను కోల్పోయినట్లు (Vodafone Idea users lose) తెలిసింది. అంతకు ముందు మే నెలలోనూ 40 లక్షల యూజర్లను కోల్పోయింది వొడాఫోన్ ఐడియా.
దేశియ అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకు మాత్రం (Jio Users gain in June) జూన్లో 54,66,556 యూజర్లు పెరిగారు. అంతకు ముందు మే నెలలో కూడా ఈ టెల్కోకు 35.54 యూజర్లు పెరిగినట్లు డేటాలో వెల్లడైంది.
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్టెల్కు కూడా జూన్లో 38,12,530 యూజర్లు (Airtel Users gain in June) పెరిగారు. అయితే మేలో ఎయిర్టెల్ 46.13 లక్షల యూజర్లను కోల్పోవడం గమనార్హం.
ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియాను నిలబెట్టేందుకు కేంద్రం కసరత్తు