ETV Bharat / business

వొడా-ఐడియాకు క్యూ1లో రూ.25,560 కోట్లు నష్టం - వొడాఫోన్ ఐడియా ఆదాయం

టెలికాం దిగ్గజం వొడాఫోన్-ఐడియా 2020-21 క్యూ1లో రూ.25,460 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.10,659.3 కోట్లకు పడిపోయింది.

record level loses to Vodafone idea
వొడాఫోన్ ఐడియాకు రికార్డు స్థాయి నష్టాలు
author img

By

Published : Aug 6, 2020, 5:49 PM IST

Updated : Aug 6, 2020, 7:35 PM IST

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో రూ.25,460 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.4,874 కోట్లు.

ఏజీఆర్​ సహా ఇతర చట్టబద్ధమైన చెల్లింపుల కోసం కేటాయింపులు పెరగటం వల్ల ఈ స్థాయి నష్టాలను నమోదు చేసినట్లు వొడాఫోన్-ఐడియా వెల్లడించింది. మొత్తం నష్టాల్లో వీటి వాటా రూ.19,440.5 కోట్లుగా పేర్కొంది.

2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వొడాఫోన్-ఐడియా ఆదాయం కూడా భారీగా రూ.10,659.3 కోట్లకు తగ్గింది. 2019-20 ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.11,269.9 కోట్లు.

దేశవ్యాప్త లాక్​డౌన్​తో స్టోర్లు మూతపడటం వల్ల వినియోగదారుల సంఖ్య కూడా భారీగా తగ్గినట్లు వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. సగటు యూజర్​ నుంచే వచ్చి నెలవారీ ఆదాయం క్యూ1లో రూ.114కు తగ్గినట్లు తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ.121గా ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:బంగారంపై రుణాల పరిమితి భారీగా పెంపు

Last Updated : Aug 6, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.