ETV Bharat / business

భారత్​లోకి 'ఎంఐ ల్యాప్​టాప్​'.. ఈ రోజే విడుదల! - mi laptop releasing today 12 pm

ఎంఐ.. మొబైల్​ రంగంలోనే ఓ విప్లవం. ఆ బ్రాండ్​ పేరుతో అత్యాధునిక ఫీచర్లు, అతి తక్కువ ధరలు కలిగిన ఫోన్లను వినియోగదారులకు అందించింది తయారీ సంస్థ షియోమీ. జూన్ 11న సరికొత్త ల్యాప్​టాప్​తో భారతీయ మార్కెట్​లోని అడుగు పెట్టనుంది. వర్చువల్ ఈవెంట్​ ద్వారా నోట్​బుక్​ను భారతీయ మార్కెట్​లోకి విడుదల చేయనుంది.

mi laptop
భారత్​లోకి 'ఎంఐ ల్యాప్​టాప్​'.. గురువారమే విడుదల!
author img

By

Published : Jun 11, 2020, 6:03 AM IST

దిగ్గజ మొబైల్ సంస్థలకు పోటీగా అత్యాధునిక ఫీచర్లతో 'ఎంఐ' మొబైల్స్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చి... మొబైల్​ రంగంలోనే విప్లవం సృష్టించింది షియోమీ. యాపిల్​, వన్​ప్లస్​ వంటి ఖరీదైన ఫోన్లలో ఉండే ఫీచర్లతో... ఎంఐ మొబైల్స్​ను తయారు చేసి, అతి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించింది. అలాంటి సంస్థ తొలిసారి ల్యాప్​టాప్​లతో భారతీయ మార్కెట్​లోకి అడుగుపెడుతోంది. దీంతో ఆ ఉత్పత్తులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎంఐ నోట్​బుక్ పేరుతో ల్యాప్​టాప్​ను.. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్​ ఈవెంట్​ ద్వారా ప్రదర్శించనున్నారు సంస్థ ప్రతినిధులు. అనంతరం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే తేదీని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్​, ట్విట్టర్​, ఫేస్‌బుక్​ సహా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

నోట్​బుక్​తో పాటు..ఎంఐ నోట్​బుక్​ మోడల్​ ఫొటోను షియోమీ ఇండియా మేనెేజింగ్​ డైరెక్టర్​ మను కుమార్​ జైన్​ విడుదల చేశారు. ఎంఐ నోట్‌బుక్​ మోడల్ విడుదల‌తో పాటు, షియోమీ ఎంఐ నోట్‌బుక్​ 'హారిజోన్​' ఎడిషన్‌ను కూడా తీసుకురానున్నట్లు సమాచారం.

ఫీచర్లు ఇవే!

  • ఇంటెల్​ కోర్​ ఐ7 ప్రాసెసర్​(10వ జనరేషన్​)
  • 12 గంటల బ్యాటరీ సామర్థ్యం
  • 14 అంగుళాల ఫుల్​ హెచ్​డీ స్క్రీన్
  • ​​డీటీఎస్​ ఆడియో సపోర్ట్
  • ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్

ఇదీ చూడండి: పెట్టుబడుల్లో భారత్​ వరుసగా 13వసారి అదే రేటింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.