ETV Bharat / business

'భారత్‌ గొప్ప శక్తిగా ఎదగడం ఖాయం' - indian business after corona virus

వచ్చే కొన్ని దశాబ్దాల్లో భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద వినియోగ కేంద్రంగా ఎదగడమే కాక, తయారీ- సేవల కేంద్రంగా మారుతుందని అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని, పెట్టుబడులకు అవకాశంగా మార్చుకోవాలని అదానీ గ్యాస్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

This is the right time to invest:adani
'భారత్‌ గొప్ప శక్తిగా ఎదగడం ఖాయం'
author img

By

Published : Jun 8, 2020, 11:25 AM IST

Updated : Jun 8, 2020, 11:39 AM IST

‘2019-20లో వృద్ధిరేటు 11 ఏళ్ల కనిష్ఠమైన 4.2 శాతానికి తగ్గినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా క్షీణిస్తుందనే అంచనాలున్నా, వచ్చే కొన్ని దశాబ్దాల్లో భారత్‌ గొప్ప శక్తిగా ఎదగడం ఖాయం. అయితే ఎన్నడూ చవిచూడని కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మంచివా? కాదా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అందుబాటులోకి వస్తున్న సమాచారం మేరకు నిర్ణయాలు సవరిస్తోంది. సంపన్న దేశాలే కరోనా వైరస్‌ ధాటికి విలవిలలాడుతున్నా, మన దేశంలో కొంతమేరకు కట్టడి చేయగలిగాం. కరోనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులే ఉన్నాయి.

ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ఇంకా ముందే తీసుకుని ఉండాలని నా అభిప్రాయం. వ్యాపారాలు బాగా దెబ్బ తిన్నాయి. జీవితాలు, ఉద్యోగాలు పోతున్నాయి. వలస కార్మికుల గురించి దేశం మొత్తం బాధపడింది. స్వల్ప-మధ్య కాలానికి కొవిడ్‌-19 ప్రభావాన్ని ఊహించడం కష్టమే. అయితే వచ్చే కొన్ని దశాబ్దాల్లో మన దేశం గొప్ప శక్తిగా ఎదుగుతుంది. అందుకే పెట్టుబడులు పెట్టడానికి, కొత్త అవకాశాలను వెతుక్కోవడానికి ఇదే సరైన సమయమ’ని పేర్కొన్నారు.

మా కంపెనీల విషయానికొస్తే..

‘మా వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నాం. సవాళ్లను ఎదుర్కోవడం కోసం భవిష్యత్‌ మార్గ సూచీ స్పష్టంగా ఉంది. మా వ్యాపారాలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం అందించేవే. అత్యవసర సేవలు, మౌలిక రంగాల్లో మేము కొనసాగుతున్నాం. మూలధన వ్యయాలు తగ్గించుకోవడం, సంస్థాగత నిర్మాణాన్ని పునఃరూపకల్పన చేయడం, దశల వారీగా నిధుల సేకరణ వంటి వాటిపై దృష్టి సారిస్తున్నాం. 2019-20లో మా గ్రూపులోని అదానీ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ముంబయి ఎలక్ట్రిసిటీ సంస్థల్లోకి వ్యూహాత్మక ఈక్విటీ భాగస్వాముల నుంచి 160 కోట్ల డాలర్ల (సుమారు రూ.12,000 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. భవిష్యత్తులో మేము మరింత వృద్ధి దిశగా అడుగులు వేయడానికి ఇవి దోహదం చేస్తాయ’ని గౌతమ్‌ అదానీ వివరించారు.

-గౌతమ్​ అదానీ, అదానీ గ్రూపు ఛైర్మన్‌

Last Updated : Jun 8, 2020, 11:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.