ETV Bharat / business

కన్వెనియెన్స్ స్టోర్ల వ్యాపారాల్లోకి రిలయన్స్ రిటైల్​ - 7 ఎలెవన్​తో రిలయన్స్ ఒప్పందం

దేశీయంగా కన్వెనియెన్స్ స్టోర్ల వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. అమెరికాకు చెందిన 7-ఎలెవెన్​ సంస్థతో ఒప్పందం ద్వారా భారత్​లో కన్వెనియెన్స్ స్టోర్లను నిర్వహించనున్నట్లు తెలిపింది. తొలి స్టోర్​ను ముంబయిలోని అందేరీ ఈస్ట్​లో ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

Reliance retail
రిలయన్స్ రిటైల్​
author img

By

Published : Oct 7, 2021, 11:46 AM IST

Updated : Oct 7, 2021, 4:30 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్​కి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్​.. భారత్​లో కన్వెనియెన్స్​ స్టోర్లను నడిపించనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన 7-ఎలెవెన్​ సంస్థతో మాస్టర్​ ఫ్రాంఛైజీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా.. మొదటి కన్వెనియెన్స్​ స్టోర్​ను ముంబయిలోని అందేరీ ఈస్ట్​లో.. ఈ శనివారమే ప్రారంభించనున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. త్వరలోనే మరిన్ని స్టోర్లను ముంబయిలోని వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

కిశోర్​ బియానికి చెందిన ఫ్యూచర్​ రిటైల్​.. 7-ఎలెవెన్ గ్రూప్​తో ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు చెప్పిన రెండు రోజులకే రిలయన్స్ రిటైల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఏమిటి ఈ కన్వెనియెన్స్ స్టోర్లు?

స్థానిక అవసరాలు, అలవాట్ల ఆధారంగా.. అక్కడి వినియోగదారులకు అవసమైన రోజువారిగా వాడే సరుకులు, తినుబండారాలు, పానియాలను విక్రయించేవే ఈ కన్వెనియెన్స్ స్టోర్లు. అమెరికా వంటి దేశాల్లో ఈ స్టోర్లకు మంచి డిమాండ్​ ఉంది. 7-ఎలెవెన్​ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో 77 వేలకుపైగా కన్వెనియెన్స్​ స్టోర్లను నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: 'ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్​ ఇండియాకు పూర్వ వైభవం'

Last Updated : Oct 7, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.