ETV Bharat / business

ఓయోలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి? - ఓయో ఎం క్యాప్​

దేశీయ హోటల్​ ఫ్రాంచైజీ సంస్థ ఓయోలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓయో ఐపీఓకు వచ్చే లోపే ఈ డీల్ పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఇటీవలే ఓయో 660 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడం గమనార్హం.

Microsoft, OYO
మైక్రోసాఫ్ట్, ఓయో
author img

By

Published : Jul 30, 2021, 3:16 PM IST

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్..​ భారత్​కు చెందిన అతిథ్య రంగ కంపెనీ ఓయోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం 9 బిలియన్ డాలర్ల (రూ.66,947 కోట్లు) విలువ కలిగిన ఈ కంపెనీ.. త్వరలోనే ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతకు ముందే.. మైక్రోసాఫ్ట్ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం తెలియరాలేదు.

ఈ విషయంపై మైక్రోసాఫ్ట్​, ఓయో నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఓయోకు.. అమెరికాకు చెందిన అతిథ్య రంగ సంస్థ ఎయిర్ బీఎన్​బీ, చైనాకు చెందిన క్యాబ్​ సేవల సంస్థలు దీదీ, గ్రాబ్​ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి.

ఐపీఓ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్​ అగర్వాల్​ గత నెల అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. గ్లోబల్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్స్​ నుంచి టీం లోన్​ బీ (టీఎల్​బీ)గా.. 660 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ఓయో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ పెట్టుబడిపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇదీ చదవండి: ఐటీ రూల్స్​ ఎఫెక్ట్​- గూగుల్​ నుంచి అవన్నీ మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.