ETV Bharat / business

స్వదేశీ మంత్రంతో మైక్రోమ్యాక్స్​ దశ తిరిగేనా?

'మైక్రోమ్యాక్స్'... ఒకప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్​లో ఓ వెలుగు వెలిగిన దేశీయ సంస్థ. చైనా కంపెనీల తాకిడితో కొంతకాలంగా రేసులో అట్టడుగుకు పడిపోయింది. అయితే 'వోకల్ ఫర్ లోకల్', 'బాయ్​కాట్​ చైనా' ఉద్యమాలతో మళ్లీ మార్కెట్​పై తన ముద్ర వేసేందుకు కృషి చేస్తోంది మైక్రోమ్యాక్స్. ఆ ప్రయత్నాలు ఏమిటి? ఆ సంస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి?

author img

By

Published : Jun 20, 2020, 4:25 PM IST

mircromax latest news
మైక్రోమ్యాక్స్​కు పూర్వ వైభవం వచ్చేనా

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'బాయ్​కాట్ చైనా' ఉద్యమం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన 'వోకల్ ఫర్​ లోకల్​' నినాదానికి మద్దతు పెరుగుతోంది. వీటిని దేశీయ కంపెనీలు క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు.. మొబైల్​ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'మైక్రోమాక్స్' ముందు వరుసలో ఉంది. దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీలకు మైక్రోమ్యాక్సే ప్రత్యామ్నాయంగా చాలా మంది భావిస్తున్నారు. దాన్ని అనుకూలంగా మార్చుకుని తిరిగి సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది మైక్రోమ్యాక్స్​.

అభిమానులు ట్విట్టర్​ ద్వారా పలు ప్రశ్నలు అడగగా.. వాటికి మైక్రోమ్యాక్స్ ఇచ్చిన సమాధానాలతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.

అభిమానులతో మైక్రోమ్యాక్స్ సంభాషణ..

"చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా కొత్త మోడళ్లను తీసుకురండి. మీకు ఆ సామర్థ్యం ఉంది. మీరు చేయగలరు. అందుకు ఇదే సరైన సమయం. భారతీయులమంతా మీతో ఉంటూ.. మీకు పూర్తి మద్దతు ఇస్తాం.." ఓ అభిమాని ట్వీట్ చేశారు.

అందుకు మైక్రోమ్యాక్స్ స్పందిస్తూ.. "'వోకల్ ఫర్ లోకల్'​కు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అంతర్గతంగా కొత్త ఉత్పత్తుల కోసం మేము తీవ్రంగా శ్రమిస్తున్నాం. త్వరలోనే సరికొత్త ఉత్పత్తులతో మీ ముందుకు వస్తాం. " అని ట్వీట్​ చేసింది.

మరో అభిమాని.. "మైక్రోమ్యాక్స్​ మీ నుంచి ఏదైనా మిడ్​రేంజ్ ఫోన్​ను అశించవచ్చా?" అని ట్విట్​ చేశాడు.

దానికి 'ప్రీమియం ఫీచర్లు, మాడ్రన్​ లుక్​, బడ్జెట్ ధరలో కొత్త మోడల్​ త్వరలోనే తీసుకురానున్నట్లు' మైక్రోమ్యాక్స్ సమాధానమిచ్చింది.

కొత్త ఉత్పత్తులతో రానున్నామని చెప్పిన మైక్రోమ్యాక్స్.. వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

కొత్త ఉత్పత్తులు ఇలా..

మైక్రోమ్యాక్స్ ట్వీట్​లతోపాటు పలు టెక్​ వార్తా సంస్థలు సేకరించిన సమచారం ప్రకారం.. త్వరలోనే ఈ కంపెనీ నుంచి మూడు కొత్త స్మార్ట్​ఫోన్లు రానున్నాయి. చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ మోడళ్లను తీసుకురానుంది. ఈ మూడు ఫోన్ల ధరలు రూ.10,000 కన్నా తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది.

సవాళ్లు..

ప్రస్తుత పరిస్థితుల్లో వినియోదారులను ఆకర్షించేందుకు మైక్రోమ్యాక్స్ ప్రయత్నాలు చేయొచ్చు. అయితే మార్కెట్లో ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా 5 స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లు దేశవ్యాప్తంగా 75 శాతం మార్కెట్​ను శాసిస్తున్నాయి. ఇది మైక్రోమ్యాక్స్​కు ప్రధాన అడ్డంకిగా మారొచ్చని నిపుణులు అంటున్నారు.

ఇదీ చూడండి:'బాయ్​కాట్ చైనా' సాధ్యమేనా? లాభదాయకమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.