లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. బ్యాంక్‌పై కేంద్రం 30 రోజుల మారటోరియం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
బీఎస్ఈలో షేరు విలువ 20 శాతం తగ్గి.. ఒక్కో షేరు రూ.12.4 వద్ద కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో 19.14 శాతం తగ్గిన ఒక్కో షేరు ప్రస్తుతం రూ.12.45 వద్ద ఉంది.
మారటోరియం ఎందుకు?
లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో..ఆర్బీఐ సూచనల మేరకు కేంద్రం మారటోరియం నిర్ణయం తీసుకుంది. 30 రోజుల పాటు ఈ మారటోరియం అమలులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. బ్యాంక్ బోర్డునూ రద్దు చేసింది. ఒక్కో డిపాజిటర్‌కు రూ.25 వేల వరకు నగదు విత్ డ్రా పరిమితి విధించింది.