ETV Bharat / business

వర్క్​ ఫ్రం హోం ఇచ్చినా.. ఆఫీస్​ల లీజులు పొడిగింపు - కార్యాలయాల స్థలాలపై అనరాక్ నివేదిక

కరోనా కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను చాలా వరకు వర్క్ ఫ్రం హోం చేయించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టెక్​ కంపెనీలకు కార్యాలయాల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని తొలినాళ్లలో అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుత పరిణామాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం పొడిగించినప్పటికీ.. కార్యాలయాలను మార్చుకోవడం లేదా పరిమాణం తగ్గించుకునే ఆలోచనలో లేవని అనరాక్ నివేదిక తెలిపింది.

Corona impact on IT firms leases
ఐటీ కార్యాలయాల లీజులపై కరోనా ప్రభావం
author img

By

Published : Nov 19, 2020, 6:54 PM IST

ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకునేందుకు అనుమతులు ఇస్తున్నప్పటికీ.. తమ కార్యాలయ స్థలాలను మాత్రం యథావిధిగా ఉంచుకునేందుకే మొగ్గుచూపుతున్నాయి దేశీయ ఐటీ సంస్థలు. చాలా కంపెనీలు కార్యాలయాల పరిమాణాన్ని తగ్గించుకునేందుకు కూడా ఇష్టపడటం లేదని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ ఇటీవలి నివేదికలో పేర్కొంది.

ఈ విషయంపై అనరాక్​ వైస్ ఛైర్మన్ సంతోశ్ కుమార్ 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశీయ ప్రధాన టెక్ కంపెనీల్లో చాలా వరకు తమ లీజులను పదేళ్ల వరకు పొడిగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

'కరోనా వైరస్ విజృంభణ తర్వాత టెక్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యాలయాల డిమాండ్ భారీగా తగ్గుతుందనే అంచనాలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిణామాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.' అని సంతోశ్ కుమార్ తెలిపారు.

లీజులను పొడిగించుకున్న టెక్ దిగ్గజాలు..

దేశంలో ప్రధాన టెక్​ కంపెనీలైన.. టీసీఎస్​, టెక్ మహీంద్రా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఐబీఎం, యాక్సెంచర్‌, క్యాప్​జెమినీ వంటి సంస్థలు ఇటీవలే తమ కార్యాలయాల లీజులను 8-9 సంవంత్సరాల వరకు పెంచుకున్నట్లు వివరించారు సంతోశ్​ కుమార్​. ఇదే సమయంలో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోంను కూడా పొడిగించినట్లు వెల్లడించారు.

కొన్ని పెద్ద కంపెనీలు మాత్రం.. తమ కార్యాలయాలను మెట్రో నగరాల నుంచి టైర్​ 2 పట్టణాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడైంది.

'కొన్ని పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల నివాస ప్రాంతాలకు దగ్గరగా కార్యాలయాలు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని మేము గుర్తించాం.' అని సంతోశ్ కుమార్ అన్నారు. టెక్ మహీంద్రా, సైయెంట్​లు.. తెలంగాణలోని వరంగల్​ మడికొండ ఐటీ పార్క్​ కొత్త డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించి.. ఇందులో 1,800 మంది ఇంజనీర్లకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

అద్దెలు యథాతథమే..

ఈ ఏడాది కార్యాలయాల అద్దెలు పెరగటం గానీ తగ్గటం గానీ ఉండకపోవచ్చని సంతోశ్​ కుమార్ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే అద్దెల రద్దు వంటివి ఉండొచ్చని చెబుతున్నారు. అద్దెల్లో మార్పులు చేయకుండా ఉండాలని రియల్టీ డెవలపర్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

మొత్తం మీద లీజింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది కన్నా.. 2021లో మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తోంది అనరాక్. కొత్తగా కార్యాలయాలు లీజులకు ఇవ్వాలనుకునే రియల్డీ డెవలపర్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాల యజమానులు అద్దెదారులను రాబట్టుకోవాలంటే.. ఆకర్షణీయమైన ధరల ద్వారా మాత్రమే సాధ్యమని సూచిస్తోంది అనరాక్ నివేదిక.

ఇదీ చూడండి:'వృద్ధి రేటు క్షీణత 10.6 శాతమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.