ETV Bharat / business

ఏజీఆర్ బకాయిలు చెల్లించండి.. కష్టాల్లో ఉన్నాం ప్లీజ్! - ఏజీఆర్ వివాదం ఏమిటి?

గెయిల్ వంటి టెలికామేతర సంస్థల ఏజీఆర్ బకాయిల్లో.. టెలికాం విభాగం 96 శాతం వదులుకోనున్నట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే టెలికాం కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్​టెల్ వంటి సంస్థలు తక్షణం ఎంతో కొంత సొమ్ము డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి నిధులు ఎంతో అవసరమని పేర్కొంది.

agr issues
ఏజీఆర్​ బకాయిల వివాదం
author img

By

Published : Jun 18, 2020, 4:32 PM IST

టెలికామేతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన రూ.4 లక్షల కోట్ల సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) బకాయిల్లో టెలికాం విభాగం (డీఓటీ) 96 శాతం వదులుకోనున్నట్లు కేంద్రం.. సుప్రీం కోర్టుకు తెలిపింది. ఏజీఆర్​ బకాయిలపై గెయిల్ సహా ఇతర టెలికామేతర సంస్థల నుంచి వస్తున్న డిమాండ్ సహా బకాయిలు వదులుకునేందుకు కారణాలతో కూడిన అఫిడవిట్​ను కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు.

అప్పటిలోపు ఆ వివరాలు చెప్పండి..

జస్టిస్​ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్​ అబ్దుల్ నజీర్​, జస్టిస్​ ఎం.ఆర్​. సిన్హాల నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కేసు విచారించింది. ఇందులో ప్రైవేటు టెలికాం కంపెనీలైన భారతీ ఎయిర్​టెల్, వొడాఫోన్​ ఐడియాలు సమర్పించిన ఏజీఆర్​ బకాయిల అఫిడవిట్​పైనా స్పందించింది. జులై మూడో వారంలో విచారణ సమయానికి ఆయా కంపెనీలు తమ ఆర్థిక స్థితిపై స్టేట్​మెంట్​ను సమర్పించాలని సూచించింది.

కష్టాల్లో ఉన్నాం: వొడాఫోన్ ఐడియా

బకాయిల వసూలుకు వీలుగా కంపెనీలు సమర్పించాల్సిన బ్యాంకు గ్యారెంటీలు, హామీల వివరాలపై ప్రశ్నించింది ధర్మాసనం. టెలికాం సంస్థలు తమ ఏజీఆర్​ బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆదేశించింది. కరోనా కారణంగా నెలకొన్న సంక్షోభంతో ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఎంతో అవసరమని పేర్కొంది. కరోనా కాలంలోనూ టెలికాం సంస్థలు ఆదాయం గడించాయని.. అందుకే వీరు కచ్చితంగా ఎంతో కొంత డబ్బు డిపాజిట్​ చేయాలని స్పష్టం చేసింది.

ఈ విషయంపై సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వొడాఫోన్‌-ఐడియా తరఫున వాదనలు వినిపించారు. ఇలాంటి సమయాల్లో డబ్బులు చెల్లిస్తే.. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడమే కంపెనీకి కష్టంగా మారుతుందని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే రూ.7 వేల కోట్లు ఏజీఆర్​ బకాయిల కింద చెల్లించినట్లు వివరించారు. ఇవి కాకుండా ప్రభుత్వం వద్ద రూ.15,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇదీ చూడండి:సెకండ్ హ్యాండ్​లో కొత్త వాహనాలు కావాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.