ETV Bharat / business

ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకోకుంటే.. వేతనం లేని సెలవులే! - వ్యాక్సిన్​ వేసుకోకుంటే వేతనం లేని సెలవులు

ఉద్యోగులు, ఇతర సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరైన నేపథ్యంలో.. అమెరికాలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే టెక్​ దిగ్గజం ఐబీఎం అమెరికాలోని తమ ఉద్యోగులంతా డిసెంబర్ 8లోపు వ్యాక్సిన్​ వేసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే వేతనం లేని సెలవులపై పంపాల్సి ఉంటుందని వెల్లడించింది.

IBM
ఐబీఎం
author img

By

Published : Oct 10, 2021, 8:59 PM IST

టెక్​ దిగ్గజం ఐబీఎం.. అమెరికాకు చెందిన తమ ఉద్యోగులంతా వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. డిసెంబర్​ 8లోగా రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే వేతనం లేకుండా విధుల నుంచి తప్పించాల్సి వస్తుందని పేర్కొంది.

అమెరికాలో పని చేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్​ సిబ్బంది అందరూ.. వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గత నెలలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐబీఎం తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

అమెరికాలో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీల్లో ఐబీఎం కూడా ఒకటి. ఈ సంస్థ ఇంతకుముందు కూడా.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిని మాత్రమే ఆఫీస్​లకు తిరిగి వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. వర్క్​ ఫ్రం హోం చేసే వారు కూడా వెంటనే వ్యాక్సిన్​ వేసుకోవాలని సూచించింది. అయితే ఇందుకు మతపరమైన, ఆరోగ్యపరమైన మినహాయింపులు మాత్రం ఉన్నాయి.

స్వయంగా దేశ అధ్యక్షుడే ఉద్యోగులకు వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పిన నేపథ్యంలో మిగతా కంపెనీలు కూడా ఐబీఎం బాటనే అనుసరించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై టెక్ దిగ్గజాలు ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇదీ చదవండి: పెట్రోల్ బంక్​ లైసెన్స్​తోనే ఈవీ ఛార్జింగ్​ స్టేషన్​కూ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.