ETV Bharat / business

ఆ వాహన సంస్థలో 15 వేల ఉద్యోగాల కోత! - వాహన సంస్థల్లో భారీగా ఉద్యోగాల కోత

వాహన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం ఆ పరిశ్రమలో పని చేసే ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. గత కొన్నాళ్లుగా కొనుగోళ్లు లేక డీలా పడ్డ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో ప్రపంచ వ్యాప్తంగా 15వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

jobs cut In Renault
రెనోలో భారీగా ఉద్యోగాల కోత
author img

By

Published : May 29, 2020, 3:11 PM IST

Updated : May 30, 2020, 12:12 PM IST

సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ప్రపంచవ్యాప్తంగా 15,000 ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. రానున్న మూడేళ్లలో 2 బిలియన్ యూరోల మేర ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఫ్రాన్స్​కు చెందిన ఈ సంస్థ. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

తాజా నిర్ణయంతో ఫ్రాన్స్​లో అత్యధికంగా 4,600 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని రెనో ప్రకటించింది. ఫ్రాన్స్​ మినహా ఇతర దేశాల్లో 10 వేలకు పైగా మందికిపైగా ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది.

ఉద్యోగాల కోత తర్వాత 2019లో 4 మిలియన్​ యూనిట్లుగా ఉన్న కంపెనీ ఉత్పాదక సామర్థ్యాన్ని..2024 నాటికి 3.3 మిలియన్లకు తగ్గించుకోనున్నట్లు రెనో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా రెనోకు 1,80,000 మంది ఉద్యోగులున్నారు.

ఇదీ చూడండి:మొబిక్విక్​పై గూగుల్ వేటు.. ప్లే స్టోర్ నుంచి తొలగింపు!

Last Updated : May 30, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.