ETV Bharat / business

జీవీకే గ్రూప్​ అధినేతలపై సీబీఐ కేసు నమోదు

ముంబయి విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీవీకే గ్రూప్ అధినేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. సంస్థ ఛైర్మన్​ వెంకట కృష్ణారెడ్డితోపాటు ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిని బుక్ చేసింది. విమానాశ్రయానికి సంబంధించి రూ.705 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఆరోపించింది సీబీఐ.

CBI books GVK
జీవీకే గ్రూప్
author img

By

Published : Jul 2, 2020, 7:41 AM IST

ప్రముఖ సంస్థ జీవీకే గ్రూప్​ ఛైర్మన్​ వెంకట కృష్ణారెడ్డి, అతని కుమారుడు సంజయ్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితోపాటు మరికొంతమందినీ ఈ జాబితాలో చేర్చింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్​)ను నిర్వహిస్తున్న ఈ సంస్థ రూ.705 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది సీబీఐ.

బోగస్ కాంట్రాక్టులు..

ముంబయి విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంలో జీవీకే ఎయిర్​పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ మేరకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) 2006 ఏప్రిల్​ 4న ఎంఐఏఎల్​తో ఒప్పందం కుదుర్చుకుంది.

జీవికే గ్రూప్ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్స్, ఏఏఐలోని కొంతమంది అధికారులకు అనుగుణంగా వివిధ మార్గాలను ఉపయోగించి నిధులను వాడుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. 2017-18 కాలంలో 9 కంపెనీలకు బోగస్ కాంట్రాక్టులు ఇచ్చారని, దీని వల్ల రూ.310 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

ఏఏఐకి నష్టం..

అంతేకాకుండా ఎంఐఏఎల్ రిజర్వు నిధులను జీవీకే గ్రూప్​ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. జీవీకే ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు ఎంఐఏఎల్​తో సంబంధం లేని సంస్థలకు చెల్లింపులు చూపించారని, ఫలితంగా ఏఏఐ నష్టపోయిందని సీబీఐ ఆరోపించింది.

ఎంఐఏఎల్​కు జీవీ సంజయ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు మరో తొమ్మిది ప్రైవేట్ కంపెనీలు, ఏఏఐలోని కొంతమంది అధికారులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'హైవే ప్రాజెక్టుల్లోనూ చైనా సంస్థలకు నో ఎంట్రీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.